Chaalbaaz’ Remake : తల్లి శ్రీదేవి హిట్ సినిమా రీమేక్ లో జాన్వీ కపూర్

శ్రీదేవి హిట్ మూవీ ‘చాల్‌బాజ్’ రీమేక్ లో జాన్వీ కపూర్ నటించబోతున్నారు. బాలీవుడ్ లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

Chaalbaaz’ Remake : తల్లి శ్రీదేవి హిట్ సినిమా రీమేక్ లో జాన్వీ కపూర్

విధాత : దివంగత ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి(Sridevi), రజనీకాంత్‌(Rajinikanth), సన్నీడియోల్‌(Sunny Deol) నటించిన హిట్‌ సినిమా ‘చాల్‌బాజ్‌’(Chaalbaaz) రీమేక్ లో కూతురు జాన్వీకపూర్(Janhvi Kapoor) నటించబోతుందన్న వార్త వైరల్ గా మారింది. 1989లో పంకజ్‌ పరాశర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నటన పరంగా శ్రీదేవి కెరీర్‌లోనే బెస్ట్‌ మూవీలలో ఒకటిగా నిలిచింది. ‘చాల్‌బాజ్‌’లో శ్రీదేవి ద్విపాత్రాభినయంలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు జాన్వీ కూడా అలానే కనిపిస్తారా లేదంటే రీమేక్‌ కథలో మార్పులు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. జాన్వీ పరమ్ సుందరీ( Param Sundari) సినిమా ఇటీవలే విడుదలైంది. ఆక్టోబర్ 2న ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’తో(Sunny Sanskari Ki Tulsikumari) మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో రామ్ చరణ్(Ram Charan) పెద్ది సినిమాలో, జూనియర్ ఎన్టీఆర్ దేవర 2లో నటిస్తుంది.

తన తల్లి శ్రీదేవి సినిమాల్లో తనకు ఇష్టమైన ‘చాల్‌బాజ్’ రీమేక్ లో నటించబోతుండటం పట్ల జాన్వీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి పాత్రను పోషించేందుకు జాన్వీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ చివరినాటికి ఈ మూవీ రీమేక్‌పైన..దర్శకుడు ఎవరు అనే విషయంపైన అధికారిక ప్రకటన వెలువడనుందని బాలీవుడ్(Bollywood) మీడియా పేర్కొంది.