Ram Charan | ‘పెద్ది’ కోసం నిద్రాహారాలు మానేసిన బుచ్చిబాబు – రామ్‌చరణ్ క్లాస్!
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై భారీ అంచనాలు. షూటింగ్ పనుల్లో నిద్రాహారాలు మానేసిన బుచ్చిబాబును చరణ్ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండమని ఆప్యాయంగా మందలించాడు.

Ram Charan Scolds Director Buchi Babu for Skipping Meals During ‘Peddi’ Shoot
(విధాత వినోదం డెస్క్)
హైదరాబాద్:
Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, ‘మీర్జాపూర్(Mirzapur)’ ఫేమ్ దివ్యేందు శర్మ, నటుడు జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీరియడ్ విలేజ్ స్పోర్ట్స్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఆట కూలీగా, పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. పొడవాటి జుట్టు, మందపాటి గడ్డం, బలమైన శరీరాకృతితో దుమ్ముతో నిండిన మైదానంలో బ్యాట్ పట్టుకుని నిలబడి ఉన్న చరణ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బుచ్చిబాబు కష్టానికి చరణ్ ప్రేమపూర్వక మందలింపు
‘పెద్ది’ షూటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తొందరగా పూర్తి చేయాలనే ఆతృతలో దర్శకుడు బుచ్చిబాబు రోజు మొత్తం సెట్లో పని చేసి, రాత్రిళ్లు ఎడిటింగ్, మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నారని తెలిసింది. తిండి, నిద్ర రెండింటినీ విస్మరించి సినిమా పనుల్లో నిమగ్నమయ్యాడట.
దీంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిసింది. అయినా షూటింగ్ ఆపకపోవడంతో దర్శకుడి సహాయకులు ఈ విషయం హీరో రామ్ చరణ్‌కు తెలుపగా, చరణ్ వెంటనే ఆప్యాయంగా కోప్పడుతూ “సినిమా తర్వాత చేయొచ్చు, కానీ ఆరోగ్యం క్షీణిస్తే ప్రయోజనం లేదు. ముందు నీ ఆరోగ్యాన్ని చూసుకో, షూటింగ్ ఆలస్యమైనా నేను నీ వెంటే ఉంటా,” అని సున్నితంగా చెప్పాడట.
చరణ్ చూపిన ఈ ఆప్యాయత సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో “చరణ్ ఎంత స్టార్ అయినా, తన టీమ్‌పై చూపే కేర్ మాత్రం అద్వితీయమే” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బుచ్చిబాబు పట్ల ఆయన చూపిన ఆప్యాయత ఫిల్మ్‌నగర్‌లో చర్చనీయాంశంగా మారింది.
షూటింగ్ ఆలస్యం – రిలీజ్ డేట్‌పై అనుమానాలు
‘పెద్ది’ని రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27, 2026న విడుదల చేస్తామని మేకర్స్ ముందుగా ప్రకటించారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో హైదరాబాద్‌లోని భారీ సెట్లో షూటింగ్ నిలిచిపోవడంతో షెడ్యూల్ కొంత వెనుకబడింది. డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి మార్చిలో విడుదల చేయాలన్న బుచ్చిబాబు ప్రణాళికకు ఇది అడ్డంకిగా మారిందని టాక్. అయినా దర్శకుడు వెనక్కి తగ్గకుండా, “ఏం జరిగినా నిర్ణయించిన తేదీకే విడుదల చేస్తాను” అనే సంకల్పంతో కొనసాగుతున్నాడట. నిద్రాహారాలు మానేసి కష్టపడుతున్న ఆయన నిబద్ధతను ఇండస్ట్రీలో పలువురు ప్రశంసిస్తున్నారు. అందుకే ఆరోగ్యం విషయంలో రామ్‌చరణ్ బుచ్చిబాబును సున్నితంగా మందలించడం జరిగింది.
ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాల ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ ఇప్పుడు ‘పెద్ది’తో బ్లాక్‌బస్టర్ ఇవ్వాలనే కసితో ఉన్నాడు. ఫ్యాన్స్ మాత్రం “ఈసారి పక్కా హిట్ ఖాయం” అంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు నడిపిస్తున్నారు.
Ram Charan’s upcoming film ‘Peddi’, directed by Buchi Babu Sana, is shaping up into a major period sports drama.
The director’s intense dedication affected his health, prompting Charan to personally advise him to prioritise well-being. Heavy rains delayed the Hyderabad schedule, but the team remains determined to aim for the March 27, 2026 release date.
Fans expect ‘Peddi’ to mark Ram Charan’s strong comeback after Acharya and Game Changer.