Janhvi Kapoor| ఏంటి.. జాన్వీ కపూర్‌కి పక్షవాతమా.. ఒక్కసారి వణికిపోయిన ఫ్యాన్స్
Janhvi Kapoor| శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.హిందీలో 2018లో వచ్చిన ధడక్ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మోస్తరు విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన పలు సినిమాల్లో నటించినప్పటికి అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

Janhvi Kapoor| శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.హిందీలో 2018లో వచ్చిన ధడక్ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మోస్తరు విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన పలు సినిమాల్లో నటించినప్పటికి అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే సినిమాల పరంగా జాన్వీకి పెద్దగా క్రేజ్ రాకపోయిన ఈ అమ్మడు తన గ్లామర్‌తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. జాన్వీ పిక్స్ చూసిన వారికి మైండ్ బ్లాక్ అయిపోయింది.
ఇక జాన్వీ కపూర్ ప్రేమయాణంతో కూడా వార్తలలో నిలుస్తుంటుంది.. శిఖర్ షిండే అనే వ్యక్తితో జాన్వీ కపూర్ రిలేషన్‌లో ఉండేదని గతంలో వార్తలొచ్చాయి. ఇటీవల ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది.మరోవైపు తన ఆరోగ్యం కూడా గురించి కూడా వివరణ ఇచ్చింది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల జాన్వీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన విషయాన్ని తన తండ్రి బోనీ కపూర్ స్వయంగా ప్రకటించగా, తన ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించిన వివరాలను బయటపెట్టింది. తాను కొంత కాలంగా వరుస షూటింగ్స్, ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న నేపథ్యంలో పలు ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. అయితే అలా ప్రయాణాలు చేయడం వలన వీక్ అయ్యాను అని జాన్వీ తెలిపింది. ఒక పాట షూటింగ్ కోసం తాను చెన్నై వెళ్లానని, అక్కడికి వెళ్లినప్పుడు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల కడుపులో నొప్పి మొదలయ్యిందని తెలిపింది జాన్వీ కపూర్.
బయట తినడం వల్ల మొదట కడుపులో నొప్పిగా అనిపించినా మెల్లగా దాని వల్ల నీరసం కూడా వచ్చింది.అనంతరం భరించలేనంత నొప్పి, వణుకు రావడంతో అసలు తనకు ఏమైందో అని అర్ధం కాక భయమేసింది.ఇక చెన్నై నుండి హైదరాబాద్‌కు ఫ్లైట్ ఎక్కే ముందు తన పరిస్థితి చూసి పక్షవాతం వచ్చిందేమో అని సందేహపడ్డానంటూ జాన్వీ పేర్కొంది. సాయం లేకుండా వాష్ రూమ్‌కి కూడా వెళ్లేలేకపోయాను. కనీసం నడవడానికి కూడా ఓపిక లేకపోవడంతో ఎలాగోలా ఆసుపత్రికి వెళ్లి మూడు రోజులు అక్కడ చికిత్స తీసుకున్నానని అసలు విషయాన్ని వివరించింది జాన్వీ కపూర్. ఆగస్ట్ 2న జాన్వీ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ఉలఝ్’ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అంతే కాకుండా ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’తో తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది.