Janhvi Kapoor | మహేంద్ర సింగ్ ధోనీకి సినిమా చూపించాలనుకుంటున్న జాన్వీ కపూర్..!
Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీకపూర్ బాలీవుడ్‌లో నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ చిత్రంలో జాన్వీకి జంటగా రాజ్‌కుమార్ రావు నటించాడు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదలవగా మంచి రెస్పాన్సే వస్తుంది.
Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీకపూర్ బాలీవుడ్‌లో నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ చిత్రంలో జాన్వీకి జంటగా రాజ్‌కుమార్ రావు నటించాడు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదలవగా మంచి రెస్పాన్సే వస్తుంది. ‘దేఖ తేను’ సాంగ్‌ని సైతం మేకర్ విడుదల చేశారు. ఈ సాంగ్ విడుదల సందర్భంగా జాన్వీ కపూర్ జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మూవీని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈ సినిమాను చూపించాలనే కోరికను బయటపెట్టింది. అయితే, ప్రస్తుతం ధోనీ చాలా బిజీగా ఉన్నారని తెలిపింది. ధోనీకి సినిమా చూపించే అవకాశం తనకు వస్తుందని ఆశిస్తున్నానని చెప్పింది.
ఇక దర్శకుడు దరణ్ మూవీలో చేయడానికి అతిపెద్ద కారణం ధోనీనేనని చెప్పింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఎంఎస్ ధోనీని కలిశానని.. తనను ఎవరు ఫొటో అడిగినా తనతో సెల్ఫీ దిగాలని అడగడం లేదని జాన్వీ ధోనీని పొగడ్తలతో ముంచెత్తింది. మిస్టర్ అండ్ మిసెస్ మహి అభిమానులతో పాఉట సెలబ్రిటీలు ప్రశంసిస్తున్నారు. ఇటీవల జాన్వీ ప్రియుడు శిఖర్ పహాడియా కూడా ట్రైలర్‌పై తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించాడు. శిఖర్ ‘వావ్! నువ్వు క్రికెట్ ఆడుకో మిసెస్ మహి’ అని కామెంట్ చేయగా.. దీనికి జాన్వీ ‘మిస్ యూ శిఖు’ అంటూ బదులిచ్చింది. ట్రైలర్‌లో మాజీ ఔత్సాహిక క్రికెటర్ మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్ రావ్ కనిపించారు. ఈ చిత్రంలో జాన్వీ అతని భార్య పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram