Horoscope | శనివారం రాశిఫలాలు.. ఈ రాశివారు జీవిత భాగస్వామితో విహారయాత్రకు వెళ్తారు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. గొప్పవారితో ఏర్పడే పరిచయాలు ముందు ముందు ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో సంయమనం పాటించడం మంచిది. పెద్దలతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే మంచిది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి గోచరిస్తోంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారులు ముందుచూపుతో, చక్కని ప్రణాళికతో మంచి లాభాలు గడిస్తారు. మీ సత్ప్రవర్తనతో అందరినీ ఆకర్షిస్తారు.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా తోటివారి సూచనలు, సలహాలు మేలు చేస్తాయి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. మీడియా, మార్కెటింగ్ రంగాల్లో ఉండేవారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో తరచూ ఏర్పడే ఆటంకాల వలన శ్రమ పెరుగుతుంది. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉంటే మంచిది. బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. వైద్యపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఒక సంఘటన మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. పని ప్రదేశంలో ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ప్రయాణాలకు, జలాశయాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ధనధాన్య లాభాలున్నాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. వృధా ఖర్చులు నివారించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మీ సమర్ధతతతో, కృషితో ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోబలంతో కృషి చేసి ఉద్యోగ వ్యాపారాలలో అనూహ్య ఫలితాలు సాధిస్తారు. పెద్దలతో, అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రియమైన వారి నుంచి కానుకలు అందుకుంటారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు పట్టించుకోకుండా ముందుకు సాగితే మంచిది. ఆర్థిక సమస్యలు రాకుండా ఖర్చులు అదుపు చేయండి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో చేసే పనులు విజయాన్నిస్తాయి. చేపట్టిన అన్ని పనులు మీకు అనుకూలంగా జరుగుతాయి. వృత్తిపరంగా కూడా చక్కగా రాణిస్తారు. మీ ప్రతిభకు అందుకునే ప్రశంసలు మీలో ఉత్సాహం నింపుతుంది. రుణ సమస్యలు జాగ్రత్తగా పరిష్కరించండి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి లోపిస్తుంది. ఒక సంఘటన మీ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తుంది. వివాదాలకు పోవద్దు. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram