Kalki 2898 AD|32 రోజులు పూర్తి చేసుకున్న కల్కి.. ఇంత వరకు ఎన్ని కలెక్షన్స్ రాబట్టింది, ఎంత లాభాలు సాధించింది..!
Kalki 2898 AD| సలార్ వంటి భారీ చిత్రంతో మంచి హిట్ కొట్టి అదే జోష్‌తో కల్కి అనే సినిమా చేశాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది.అంతేకాదు ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా కూడా కల్కి మూవీ నిలిచింది. అయితే ఈ మూవీ విడుదలై 32 రోజులు కాగా, ఈ 32 రోజులలో కల్కి ఎంత కలెక్ట్ చేసింది అనేది చూస్తే.. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది . తొలిసారిగా అమెరికాలో రూ.100 కోట్లు సాధించిన సినిమా

Kalki 2898 AD| సలార్ వంటి భారీ చిత్రంతో మంచి హిట్ కొట్టి అదే జోష్‌తో కల్కి అనే సినిమా చేశాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది.అంతేకాదు ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా కూడా కల్కి మూవీ నిలిచింది. అయితే ఈ మూవీ విడుదలై 32 రోజులు కాగా, ఈ 32 రోజులలో కల్కి ఎంత కలెక్ట్ చేసింది అనేది చూస్తే.. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది . తొలిసారిగా అమెరికాలో రూ.100 కోట్లు సాధించిన సినిమాగా నిలవబోతోంది. మరో వారం రోజుల్లో కల్కి అమెరికాతోపాటు ఇతర దేశాలన్నీ కలిపి 20 మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకోబోతోంది
ఇప్పటికే కల్కి బ్రేక్ ఈవెన్ అధిగమించి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటివరకు రూ.156 కోట్ల లాభాన్ని అందించింది. నిర్మాత అశ్వనీదత్ కు ఈ సినిమా వల్ల ఇప్పటివరకు రూ.125 కోట్లకు పైగా లాభం వచ్చింది. త్వరలోనే ఈ సినిమా జపాన్ లో కూడా విడుదలవుతోంది. అక్కడ వచ్చే కలెక్షన్లతో కల్కి భారీ లాభాలను ఆర్జించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్ట్ 15 వరకు కల్కి హంగామా నడుస్తూనే ఉంటుంది. రానున్న రోజులలో ఈ చిత్రం రూ. 1500 కోట్ల మార్క్ వరకు చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 372కోట్లు అయ్యిందట. ఈ లెక్కన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లో వెళ్తుందీ మూవీ. ఈరోజుల్లో ఎంత ప్యాన్ ఇండియా మూవీ అయినా విడుదలయిన రెండు వారాలకే కలెక్షన్స్ లేక థియేటర్ నుండి వెళ్లిపోతుంది.
కాని కల్కి 2898 ఏడీ’ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఇప్పటికీ ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో సినిమా ఇప్పట్లో థియేటర్స్ నుండి పోయేలా కనిపించడం లేదు. ఇక ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నవారు లేకపోలేదు. ప్రభాస్ హీరోగా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన కల్కి 2898 ఏడీ సినిమాని మహభారతం ఎలిమెంట్లకి సైన్స్ ఫిక్షన్ జోడించి దర్శకుడు చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్, మహాభారతం ఎలిమెంట్లు సినిమా సూపర్ హిట్ అయ్యేందుకు తోడ్పడ్డాయి అని చెప్పాలి.