Kangana Ranaut| కంగ‌నాకి పుష్ప‌గుచ్చం ఇచ్చిన బండి సంజ‌య్..ప‌ట్టించుకోకుండా వెళ్లిపోయిన ఫైర్ బ్రాండ్

Kangana Ranaut| ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు గ‌త కొద్ది కాలంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. అయితే ఊహించ‌ని విధంగా రాజ‌కీయాల‌లోకి వెళ్లి ఘ‌న విజ‌యం సాధించింది. ఇటీవ‌ల జరిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో త

  • By: sn    cinema    Jun 07, 2024 4:02 PM IST
Kangana Ranaut| కంగ‌నాకి పుష్ప‌గుచ్చం ఇచ్చిన బండి సంజ‌య్..ప‌ట్టించుకోకుండా వెళ్లిపోయిన ఫైర్ బ్రాండ్

Kangana Ranaut| ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు గ‌త కొద్ది కాలంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. అయితే ఊహించ‌ని విధంగా రాజ‌కీయాల‌లోకి వెళ్లి ఘ‌న విజ‌యం సాధించింది. ఇటీవ‌ల జరిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 71వేల ఓట్ల మెజార్టీతో కంగన గెలుపొందారు. రాయల్​ ఫ్యామిలీ కంచు కోటగా ఉన్న మండి స్థానంలో కంగనా రనౌత్ విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఇక ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు ఢిల్లీలో జ‌ర‌గ‌గా ఆ కార్య‌క్ర‌మానికి కంగ‌నా ర‌నౌత్ కూడా హాజ‌రైంది.

ఢిల్లీలోని పాత పార్లమెంట్‌ భవనంలో ఎన్డీయే కూటమి సమావేశం లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎన్డీయే కూటమి నేతలు మూడోసారి ఎన్టీయే ప‌క్ష‌నేత‌గా మోదీని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక వారంద‌రు మోదీకి శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే పార్లమెంటరీ పార్టీ స‌మావేశానికి హాజరైన కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజ‌య్‌ని కంగ‌నా ర‌నౌత్ అవ‌మాన‌ప‌ర‌చ‌డం హాట్ టాపిక్‌గా మారింది. స‌మావేశానికి ముందు మండీ ఎంపీ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా రనౌత్, లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ ఒక‌రికొక‌రు ఎదురు ప‌డ‌గా, శుభాకాంక్ష‌లు తెలియ‌జేసుకున్నారు.

ఇక అక్క‌డే ఉన్న బండి సంజ‌య్.. కొత్త‌గా ఎంపీ అయిన కంగ‌నాకి ఫ్ల‌వ‌ర్ బొకే ఇచ్చి విషెస్ తెలియ‌జేస్తాడు. ఆ స‌మ‌యంలో కంగ‌నా ఆయ‌న ఇచ్చిన బొకేని కూడా తీసుకోకుండా సంజ‌య్‌ని ప‌ట్టించుకోకుండా ముందుకు వెళుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజ‌న్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. బండి సంజ‌య్‌ని బీజేపీ అధిష్టానం ఎలాగు ప‌ట్టించుకోలేదు, క‌నీసం కంగ‌నా అయిన ప‌ట్టించుకోక‌పోతే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, లోక్‌స‌భ‌కు ఎన్నికైన సినీ న‌టి, ఎంపీ కంగ‌నా ర‌నౌత్‌పై .. చండీఘ‌డ్ విమానాశ్ర‌యంలో మ‌హిళా కానిస్టేబుల్ చేయి చేసుకున్న విష‌యం తెలిసిందే. కంగ‌నా చెంప చెళ్లుమ‌నిపించిన ఆ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేశారు.