Hema| హేమ బాగోతం బ‌య‌ట‌పెట్టిన క‌ళ్యాణి.. అమ్మాయిలని అమ్మేస్తుందా?

Hema| గ‌త కొద్ది రోజులుగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ పేరు నెట్టింట హాట్ టాపిక్‌గా మార‌డం మ‌నం చూశాం.బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ పేరు బ‌య‌ట‌కు రాగా, ఆమె చాలానే డ్రామాలు ఆడింది. పార్టీలో దొరికినా కూడా దానిని క‌ప్పి పుచ్చుకుంటూ తాను తన ఫామ్ హౌస్ లో ఉన్నానని, ఎంజాయ్ చేస్తు

  • By: sn    cinema    May 27, 2024 8:10 AM IST
Hema| హేమ బాగోతం బ‌య‌ట‌పెట్టిన క‌ళ్యాణి.. అమ్మాయిలని అమ్మేస్తుందా?

Hema| గ‌త కొద్ది రోజులుగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ పేరు నెట్టింట హాట్ టాపిక్‌గా మార‌డం మ‌నం చూశాం.బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ పేరు బ‌య‌ట‌కు రాగా, ఆమె చాలానే డ్రామాలు ఆడింది. పార్టీలో దొరికినా కూడా దానిని క‌ప్పి పుచ్చుకుంటూ తాను తన ఫామ్ హౌస్ లో ఉన్నానని, ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. ఆ త‌ర్వాత మ‌రో వీడియోలో చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాన‌ని పేర్కొంది. పోలీసులు తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నట్లుగా ఆమె పోస్ట్ చేసిన వీడియోలు ఉన్నాయి. చివ‌ర‌కి హేమ‌కి రిపోర్ట్‌లో పాజిటివ్‌గా రావ‌డంతో ఆమె ఇప్పుడు సైలెంట్ అయింది. అయితే హేమ‌కి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. కాక‌పోతే ఆమె వివాదాల‌తో పేరు పాడు చేసుకుంటుంది.

మా ఎలక్షన్స్ సమయంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఆ స‌మ‌యంలో న‌లుగురు నానా ర‌కాలుగా మాట్లాడుకున్నారు. ఇక ఇప్పుడు హేమ రేవ్ పార్టీలో దొరికింది అని తెలియ‌డంతో ఆమె గురించి కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా న‌టి కరాటే క‌ళ్యాణి ఆమె గురించి స్ట‌న్నింగ్ కామెంట్స్ చేస్తూ అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయేలా చేస్తుంది. ఇటీవ‌ల హేమ‌కి త‌గిన శిక్ష ప‌డాల‌ని చెప్పిన క‌రాటే క‌ళ్యాణి తాజాగా హేమ రేవ్ పార్టీలకు వెళ్లడమే కాదు, అక్కడ కొంతమంది అమ్మాయిలని సప్లై చేస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది

కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ .. హేమ చాలా మందిని మిస్ లీడ్ చేస్తుంటుంది. ఈ రేవ్ పార్టీ ఇష్యూ నే కాకుండా గతంలో కూడా ఆమె విష‌యంలో చాలా జరిగాయి. హేమ దగ్గర కొంతమంది అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ ఫోటోలను గ్రూప్ లలో షేర్ చేస్తూ ఉంటుంది. దానికి నేనే సాక్ష్యం. గ‌తంలో ఒకసారి జబర్దస్త్ కమెడియన్ వర్ష ఫోటోను గ్రూప్ లో పెట్ట‌గా, ఎందుకు ఈ ఫొటో పెట్టావ్ అని అడ‌గ‌గా, వెంట‌నే డిలీట్ చేసింది. అయితే ఎందుకు పెట్టింది అని క‌నుక్కుంటే ఎవరికో పెట్టబోయి మీకు పెట్టేశానని ఎవరితోనో చెప్పిందట.ఇలాంటి త‌ప్పులు చేస్తూ ఆమె దొరికిపోతూనే ఉంది. అస‌లు వర్ష ఫొటో ఆమె ద‌గ్గ‌ర‌కు ఉంది, అది ఎవ‌రికి పంపాలి . ఈ డ్ర‌గ్స్ కేసు నుండి అయితే హేమ త‌ప్పించుకోలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింద క‌రాటే క‌ళ్యాణి . ఇక బిగ్ బాస్ ఫేమ్ త‌మ‌న్నా కూడా హేమ గురించి మాట్లాడుతూ..ఆమె రేవ్ పార్టీలకు నటి హేమ హాజరు కావడంతో పాటు, ఇండస్ట్రీలో ఉండే అనేక మంది అమ్మాయిలకు ఎరవేసి వాళ్ళని కూడా సప్లై చేస్తూ కోట్లు గడిస్తున్నది అని పెద్ద బాంబ్ పేల్చింది.