Kasturi shankar|దానికి ఒప్పుకోలేద‌ని న‌న్ను తీసేశారు.. మ‌ల‌యాళంలో నాకు అది వ‌ర‌స్ట్ ఎక్స్‌పీరియెన్స్

Kasturi shankar|గృహ‌ల‌క్ష్మీ సీరియ‌ల్‌తో ఫుల్ ఫేమ‌స్ అయింది న‌టి క‌స్తూరి. ఆమె సీరియ‌ల్స్‌తో పాటు సినిమాలు కూడా చేసింది. అయితే ఈమె ఎక్కువ‌గా

  • By: sn    cinema    Apr 20, 2024 7:26 PM IST
Kasturi shankar|దానికి ఒప్పుకోలేద‌ని న‌న్ను తీసేశారు.. మ‌ల‌యాళంలో నాకు అది వ‌ర‌స్ట్ ఎక్స్‌పీరియెన్స్

Kasturi shankar|గృహ‌ల‌క్ష్మీ సీరియ‌ల్‌తో ఫుల్ ఫేమ‌స్ అయింది న‌టి క‌స్తూరి. ఆమె సీరియ‌ల్స్‌తో పాటు సినిమాలు కూడా చేసింది. అయితే ఈమె ఎక్కువ‌గా కాంట్ర‌వ‌ర్సీస్‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటుంది. అనేక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు చెబుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటుంది. తాజాగా కస్తూరి శంకర్ క్యాస్టింగ్ కౌచ్ ని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేసింది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఉంద‌నేది నిజం. ప్ర‌తి ఒక్క అమ్మాయి కూడా ఏదో ఒక ద‌శ‌లో లైంగిక వేధింపుల‌కి గుర‌వుతూనే ఉంటుది. బ్యాక్‌గ్రౌండ్ లేని వారు కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేయాల్సిందే. అదృష్టం కొద్ది అలాంటి అనుభ‌వాలు మాకు ఎదురు కాలేదు అని క‌స్తూరి చెప్పింది. ఇక కాస్టింగ్ కౌచ్ విష‌యంలో త‌న అనుభ‌వాలు తెలియ‌జేస్తూ.. గ‌తంలో దీని గురించి మాట్లాడాను.

అయితే న‌న్ను దానికి ఒప్పుకోలేద‌ని చాలా సినిమాల నుండి తీసేసారు. ఎపిసోడ్స్ కూడా లేపేశారు. తెలుగులో ఇబ్బందులు పెద్ద‌గా లేవు కాని త‌మిళంలో మాత్రం చూశాను. అయితే మ‌ల‌యాళంలో మాత్రం నాకు వ‌ర‌స్ట్ ఎక్స్‌పీరియెన్స్ ఉంది. మలయాళంలో అది నా కమ్ బ్యాక్ మూవీ. అది ఒక పెద్ద ప్రాజెక్ట్. దానికి ఒప్పుకోలేదని తీసేశారు. అయితే ఇప్పుడు మలయాళ పరిశ్రమ బాగుంది అని పేర్కొంది క‌స్తూరి. అన్ని రంగాల‌లో కూడా ఇలాంటివి అమ్మాయిల‌కి ఎదుర‌వుతూనే ఉంటాయి. ఒక బిల్డింగ్ క‌ట్టే స‌మ‌యంలో మేస్త్రికి, కూలికి మ‌ధ్య కూడా లైంగిక వేధింపులు ఉంటాయి. అయితే అంద‌రు అలా ఉండ‌రులేండి.

చిత్ర పరిశ్రమలో కూడా రెండు రకాల మనుషులు ఉంటారు. నాకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి అని సినిమా ప‌రిశ్ర‌మ నుండి బ‌య‌ట‌కు రాలేదు. అంద‌రు చెడ్డ‌వారు అయితే సినిమాలు ఎలా చేసేదానిని. చెడు మంచి అన్ని చోట్లా ఉంటుంది. అందువలన చిత్ర పరిశ్రమను తప్పుబట్టకూడ‌దు. కాక‌పోతే మ‌న‌కు ఎదురైన స‌మ‌స్య‌ల‌ని ఎలా చేధించాల‌ని ఎక్కువ‌గా ఆలోచించాలి అని క‌స్తూరి చెప్పుకొచ్చారు. ఇప్పుడు క‌స్తూరి చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.