KBC 16| కౌన్ బనేగా కరోడ్ పతి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. 16వ సీజన్ ఎప్పటి నుండి మొదలు కానుంది అంటే..!
KBC 16| అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా రూపొందిన క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి షో కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకలుకి మంచి వినోదంతో పాటు విజ్ఞానం పంచుతుం

KBC 16| అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా రూపొందిన క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి షో కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకలుకి మంచి వినోదంతో పాటు విజ్ఞానం పంచుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.అయితే ఈ షో సక్సెస్ ఫుల్‌గా 15 సీజన్స్ పూర్తి చేసుకోగా, ఇప్పుడు 16వ సీజన్ కోసం సిద్ధమైంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ షోకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ జరిగాయి. అయితే కొత్త సీజన్‌ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనే విషయాన్ని నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. 16వ సీజన్ ఆగస్టు 12వ తేదీ నుండి ప్రతీ సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్నట్టు తెలియజేశారు.
కౌన్ బనేడా కరోడ్ పతి షో 16వ సీజన్ ‘సోనీ టీవీ ఛానెల్’లో ప్రసారం కానుండగా, డిజిటల్ విషయానికి వస్తే, ‘సోనీ లివ్’ ఓటీటీలోనూ రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ అవుతుంది. 16వ సీజన్ స్వాతంత్య్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు ప్రారంభం కానుండగా, ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో అమితాబ్ బచ్చన్.. జీవితం సవాళ్లతో కూడుకొని ఉంటుందని, ప్రశ్నలని సంధిస్తుందని అమితాబ్ పేర్కొన్నారు. అయితే వాటన్నింటిని దాటుకొని ముందుకు సాగాలని, సవాళ్లకి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని తెలియజేశారు.
కొన్ని సంవత్సరాలుగా అమితాబ్ ఈ షోని సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తుండగా, తాజా సీజన్‌తో కూడా అలరించనున్నారని చెబుతున్నారు. ఎనిమిది పదుల వయస్సులోను అమితాబ్ ఎంతో చలాకీగా కనిపిస్తూ ఇటు షోస్, అటు సినిమాలతోను అదరగొడుతున్నారు. ఇటీవల విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమాలో అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామగా నటించారు. ఇందులో అమితాబ్ భారీ స్టంట్‌లతో అదరగొట్టారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి చిత్రానికి అమితాబ్ చాలా ప్లస్ అయ్యారు.ఇటీవల ఈ సినిమాపై అమితాబ్ ఆసక్తికర కామెంట్ చేశారు. సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించడంపై స్పందిస్తూ.. రూ.1000కోట్లు అనేది ప్రభాస్‍కు అలవాటేమో అని, కానీ తనకు గొప్ప విషయమంటూ చెప్పుకొచ్చారు.