Krithi Shetty| కృతి శెట్టికి బ్యాడ్ టైమ్ న‌డుస్తుందా.. మ‌న‌మే క‌లెక్ష‌న్స్‌కి కృతినే గండి కొట్టిందా..!

Krithi Shetty| ఉప్పెన'తో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ‌ కృతి శెట్టి. ఇందులో బేబమ్మగా తనదైన నటన, అందంతో ఆకట్టుకుంటుంది. డెబ్యూ చిత్రంతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరే స‌రికి కృతి రేంజ్ పెరిగింది. ఈ సినిమా త‌ర్వాత కృతి శెట్టి.. శ్యామ్‌ సింగరాయ్‌, బంగర్రాజు చిత్రాలతో హ్యా

  • By: sn    cinema    Jun 15, 2024 2:20 PM IST
Krithi Shetty| కృతి శెట్టికి బ్యాడ్ టైమ్ న‌డుస్తుందా.. మ‌న‌మే క‌లెక్ష‌న్స్‌కి కృతినే గండి కొట్టిందా..!

Krithi Shetty| ఉప్పెన’తో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ‌ కృతి శెట్టి. ఇందులో బేబమ్మగా తనదైన నటన, అందంతో ఆకట్టుకుంటుంది. డెబ్యూ చిత్రంతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరే స‌రికి కృతి రేంజ్ పెరిగింది. ఈ సినిమా త‌ర్వాత కృతి శెట్టి.. శ్యామ్‌ సింగరాయ్‌, బంగర్రాజు చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టింది. వరుస హిట్స్‌ కెరీర్‌లో దూసుకుపోతున్న ఈ బేబమ్మకు ‘ది వారియర్‌’ మూవీకి బ్రేక్‌ వేసింది. ఈ సినిమా త‌ర్వాత కృతిశెట్టికి వ‌రుస ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించాయి. తెలుగులో కూడా పెద్ద‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డు అవ‌కాశాల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసింది.

ఈ స‌మ‌యంలో మ‌న‌మే అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. ఈ సినిమా జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది. మనమే సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కానీ ఆ బజ్ సరిపోవటం లేదు. ఈ క్ర‌మంలో ప్రమోషన్స్ కు కృతి శెట్టిని ఓ రెండు రోజులు తమకు కేటాయిస్తే చాలు అని చెప్పారట. కృతి మాత్రం తాను తమిళ కమిట్మెంట్స్ లో బిజిగా ఉన్నందు వ‌ల‌న రావ‌డం కుద‌ర‌ద‌ని చెప్పింద‌న‌ట‌. చిత్ర రిలీజ్‌కి ముందు మాత్ర‌మే ఆమె ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంది. అయితే రిలీజ్ త‌ర్వాత ఆమె థియేట‌ర్స్ విజిట్ చేయ‌డం, మీడియాతో మాట్లాడ‌డం వంటివి చేయ‌లేదట‌.

హీరో,హీరోయిన్స్ ప్రమోషన్స్ లో పాల్గొంటే కలెక్షన్స్ పికప్ అవుతాయని డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. హీరోయిన్ లేనిదే హీరో ముందుకు రాడు. దాంతో సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయ్యిపోయింది. ఈ చిత్రానికి రూ.12.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.13 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.6.13 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.6.87 కోట్ల షేర్ ను రాబట్టాలి. సినిమాలో హీరో శర్వానంద్, హీరోయిన్ కృతి శెట్టి ఎంతో అద్భుతంగా నటించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా కథ అంతా ఓ చిన్న పిల్లాడి చుట్టూ తిరుగుతుంది. ఇక సినిమాలో శర్వానంద్, చిన్న పిల్లాడి మధ్య వచ్చే సీన్స్ ఎంతో హిలేరియస్‌గా, కామెడీగా ఉన్నాయి అంటున్నారు చిత్రం చూసిన ప్రేక్షకులు. ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాక సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి.