Kalpana Rai| పెంచుకున్న కూతురు మోసం.. చివరి రోజుల్లో కల్పనా రాయ్ అన్ని కష్టాలు అనుభవించిందా..!
Kalpana Rai| తెలుగు తెరపై ఎంతో మంది హాస్యనటులుగా పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. అందులో కల్పనారాయ్ కూడా ఒకరు.తనదైన నటనతో సినీ ప్రియులను కడుపుబ్బా నవ్వించిన కల్పనా రాయ్ తన యాస్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రలు పోషించింది. 430కి
Kalpana Rai| తెలుగు తెరపై ఎంతో మంది హాస్యనటులుగా పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. అందులో కల్పనారాయ్ కూడా ఒకరు.తనదైన నటనతో సినీ ప్రియులను కడుపుబ్బా నవ్వించిన కల్పనా రాయ్ తన యాస్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రలు పోషించింది. 430కి పైగా సినిమాలలో నటించిన కల్పనా రాయ్ జంబలకిడి పంబ, ప్రేమించచుకుందాం రా, కలిసుందం రా వంటి చిత్రాల్లో తన పాత్రలతో ఎంతగానో అలరించింది. 1950లో కాకినాడలో జన్మించిన ఆమె అసలు పేరు సత్యవతి. యుక్త వయస్సులో ఎంతో అందంగా ఉండే కల్పనా నీడలేని ఆడది సినిమాతో వెండితెరకు పరిచయమైంది.

ఆ తర్వాత లేడి కమెడీయన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. అయితే ఎంత సంపాదించిన అందులో కొంత తన చుట్టు పక్కల వారికి సాయం చేసేది. ఆమె మంచితనమే ఆమెకు శాపంగా మారింది. ఆస్తి మొత్తం పోయాక ఆమె చుట్టు పక్కన వారు దూరం అయ్యారు. అమ్మాయిని దత్తత తీసుకొని ఎంతో గారాబంగా పెంచగా, ఆమె ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని కల్పనా రాయ్‌ని వదిలేసి వెళ్లింది. ఆ సమయంలో కల్పనా రాయ్ చాలా క్షోభకి గురైంది. ఇక ఆ తర్వాత ఆమె దగ్గర డబ్బులు అన్ని ఆవిరి అయ్యాయి. చనిపోయేముందు పది రోజులపాటు తిండిలేక ఆకలితో అలమటించింది. 2008వ సంవత్సరంలో హైదరాబాదులో ఇందిరానగర్ లో మృతి చెందింది.
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు కూడా డబ్బులు లేక కల్పనా రాయ్ మరణించడంతో ఆమె అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి సమయంలో మా మూవీ అసోసియేషన్ ముందుకు వచ్చి ఈమె అంతక్రియలను 10 వేల రూపాయలతో జరిపించినట్టు సమాచారం. మూత్ర పిండాలు, గుండె వ్యాధుల బారినపడి, ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ చివరి దశలో కష్టాలు కడగండ్లు మిగిల్చుకొని కన్నుమూసింది. ఆమె గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతం అవుతున్నారు. చివరి రోజులలో ఆమె ఇన్ని కష్టాలు అనుభవించిందా అంటూ బాధపడుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram