Mahesh Babu Niece Jhanvi Swaroop: సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు..!

సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మహేశ్ బాబు మేనకోడలు, మంజుల ఘట్టమనేని కుమార్తె జాన్వీ స్వరూప్ త్వరలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనున్నారు. జాన్వీ పుట్టినరోజు సందర్భంగా మంజుల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. జాన్వీ గతంలో 'మనసుకు నచ్చింది'లో బాలనటిగా కనిపించింది.

Mahesh Babu Niece Jhanvi Swaroop: సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు..!

విధాత : సినిమాల్లోకి సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మంజుల కూతురు జాన్వీ స్వరూప్ త్వరలోనే తెరంగేట్రం చేయనున్నారు. స్టార్ హీరో మహేశ్ బాబుకు జాన్వీస్వరూప్ స్వయానా మేనకోడలు. జాన్వీ స్వరూప్ సినీ ఇండస్ట్రీ ఎంట్రీపై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేసిన మంజుల ఘట్టమనేని పోస్టు చేయడం విశేషం. జాన్వీ స్వూరూప్ ఫోటో స్టిల్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. జాన్వీ పుట్టినరోజు సందర్భంగా ఆమె సినీ ఎంట్రీని వెల్లడిస్తూ మంజుల ఈ ఫొటోలను విడుదల చేశారు. కుమార్తె తెరంగేట్రంపై మంజుల ఆనందం వ్యక్తంచేస్తూ ఆమెను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు. “నా ముద్దుల కూతురు జాన్వీ స్వరూప్.. బాగా పెద్దదైంది.. తనదైన జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది.. ఆమె తనతోపాటు ఓ ప్రకాశవంతమైన వారసత్వాన్ని వెంట తీసుకొస్తోంది.. ఇప్పుడిక వెలగడం ఆమె వంతు. ఆమె మ్యాజిక్, ఆమె టాలెంట్, ఆమె మనసుపై నాకు నమ్మకం ఉంది. నాకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిని ప్రపంచం చూడటానికి సిద్ధంగా ఉంది. నా డార్లింగ్.. నీ కోసం స్క్రీన్, ఈ ప్రపంచం వేచి చూస్తోంది. ఐ లవ్యూ సో మచ్.. హ్యాపీ బర్త్ డే మై జాను” అనే క్యాప్షన్ తో ఇన్‌స్టాలో మంజుల పోస్ట్ చేసింది.

జాన్వీ గతంలో 2018లో విడుదలైన ‘మనసుకు నచ్చింది’లో బాలనటిగా అతిథి పాత్రలో కనిపించారు. ఆ సినిమాకు మంజుల దర్శకత్వం వహించగా మహేశ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఇన్నాళ్లకు జన్వీ స్వరూప్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. జాన్వీ ఘట్టమనేని నటించనున్న సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. అతను ఇప్పటికే మంగళవారం 2సినిమా తో టాలీవుడ్ లోకి రాబోతున్నారు. రమేష్ బాబు కూతురు భారతి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటిస్తున్న సినిమా షూటింగ్ లో ఉంది.  కృష్ణ మూడో అల్లుడు నటుడు సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ సైతం ప్రభార్ ఫౌజీ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పెద్ద కొడుకు చరిత్ మానస్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ చైల్డ్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.