MAHESH BABU NEW LOOK । కొత్త లుక్‌లో హాలీవుడ్ హీరోలా మెరిసిపోతున్న మహేశ్‌బాబు
ముఖ్యమంత్రికి చెక్‌ను అందజేసిన సందర్భంలోని ఫోటోలలో మహేశ్ హాలీవుడ్ హీరో కీనూ రీవ్స్‌ను తలపిస్తున్నాడని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పొడుగాటి జుట్టు, గుబురు గడ్డం చూస్తుంటే అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. హాలీవుడ్ మెటీరియల్, బాబులకే బాబు, ఏమున్నాడ్రా బాబూ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
MAHESH BABU NEW LOOK । తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త అవతారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. హాలీవుడ్ హీరోలా ఉన్న ఆయన ఫోటోలను చూసిన అభిమానులు మురిసిపోతూ, తెగ షేర్ చేస్తున్నారు. తెలంగాణ వరద బాధితుల సహాయార్థం (flood victims) ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి విరాళం అందించారు. తన భార్య నమ్రతతో కలిసి సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని సీఎం (Revanth Reddy) నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎంను కలిసి వరద బాధితుల సహాయార్థం 50 లక్షల విరాళం అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేరిట ఈ చెక్కును అందజేశారు. AMB తరపున మరో రూ.10లక్షలు కూడా విరాళంగా ఇచ్చారు.
కాగా, ముఖ్యమంత్రికి చెక్‌ను అందజేసిన సందర్భంలోని ఫోటోలలో మహేశ్ హాలీవుడ్ హీరో కీనూ రీవ్స్‌ను తలపిస్తున్నాడని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పొడుగాటి జుట్టు, గుబురు గడ్డం చూస్తుంటే అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. ఇక బాబు లుక్ చూసిన అభిమానులు హాలీవుడ్ సినిమా జాన్ విక్ (John Wick) కథానాయకుడు కీన్ రీవ్స్ (Keanu Reeves) లా కనిపిస్తున్నాడంటూ ఫిదా అవుతున్నారు. హాలీవుడ్ మెటీరియల్, బాబులకే బాబు, ఏమున్నాడ్రా బాబూ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళితో మహేశ్ బాబు ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ జనవరిలో సెట్స్‌పైకి వెళుతుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్‌తో రాజమౌళి చాలా హడావుడిగా ఉన్నాడు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని దర్శకుడు ఇప్పటికే హింట్ ఇచ్చాడు. ఈ సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. మహేశ్‌బాబు అభిమానులే కాకుండా.. యావత్ దేశం ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తి కనబరుస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram