Manchu Lakshmi| మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటిగా, నిర్మాతగా, హోస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. ఇక ఇప్పుడు సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో రూటు మార్చి సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలతో కు
Manchu Lakshmi| మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటిగా, నిర్మాతగా, హోస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. ఇక ఇప్పుడు సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో రూటు మార్చి సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకి పిచ్చెక్కించే ప్రయత్నం చేస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో మంచు లక్ష్మీని దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. వాటిని ఆమె పట్టించుకోదు. అయితే ముంబై చెక్కేసిన ఈ భామ ఇప్పుడు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తుంది. ఇటీవల తన తండ్రిపైనే ఆరోపణలు చేసింది మంచక్క.
సౌత్ ఇండియాలో హీరోల కూతుళ్లు, సిస్టర్స్ కి ఆఫర్స్ ఇవ్వరని , మా నాన్నకు నేను నటి కావడం ఇష్టం లేదని, పితృస్వామ్య సమాజంలో నేను కూడా బాధితురాలిని అని మంచు లక్ష్మి కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. కెరీర్ కోసం ప్రస్తుతం మంచు లక్ష్మి మకాం ముంబై కి మార్చగా తన ఫ్రెండ్స్ రకుల్ ప్రీత్, రానా ముంబై రావాలంటూ ఎంతగానో ప్రోత్సహించారని చెప్పుకొచ్చింది. ఇక ముంబైలో ఓ ఖరీదైన ఇల్లు అద్దెకు తీసుకొని అందులో ఉంటున్న మంచు లక్ష్మీ అంతకముందు పలువురు ఇళ్లలో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. రకుల్ ఇంట్లో కొద్ది రోజులు ఉన్నట్టు చెప్పిన మంచు లక్ష్మీ రామ్ చరణ్ ఇంట్లో కూడా ఉన్నట్టు తాజా ఇంటర్వ్యూలో తెలియజేసింది.
నేను ముంబై వచ్చినప్పుడు ఇక్కడ ఉండటానికి అపార్ట్మెంట్ ఏం లేదు. ఆ సమయంలో రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను. ఈ విషయం ఎవరికి చెప్పలేదు. అందుకు కారణం ఆ విషయం నేను చెబితే మీరు రామ్ చరణ్ ఇంట్లో ఉంటున్నారు కదా, పని చేయాల్సిన అవసరం ఏంటని అంటారు. అందుకే నేను నీ ఇంట్లో ఉంటున్నట్టు చెప్పొద్దు అని కూడా రామ్ చరణ్‌కి చెప్పాను. అప్పుడు చరణ్ నేను ఎందుకు చెబుతా అని అన్నాడు. అయితే నా నోరు ఆగదు కాబట్టి నేనే చెప్పేశా. కొద్ది రోజుల తర్వాత నేను ఇనీ ఇంట్లో ఉండనని చరణ్‌తో అంటే నీకు నచ్చినన్ని రోజులు నా ఇంట్లో ఉండు అని చరణ్ చెప్పాడు. అసలు నేను ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్నానో కూడా చరణ్‌కి తెలీదు అని మంచు లక్ష్మీ పేర్కొంది. అంతేకాకుండా తాము 142 మంది ఆర్టిస్ట్స్ తో ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశామని, అందులో రానా, రామ్ చరణ్ తో పాటు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిపింది. ఇందులో మేము సినిమాల టీజర్స్, ట్రైలర్స్ వంటివి షేర్ చేస్తాం. అప్పుడు అందరు కూడా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వాటిని ప్రమోట్ చేస్తారు. అందుకే ఆ గ్రూప్ క్రియేట్ చేసినట్టు ఆమె పేర్కొంది.