Vijay Deverakonda| ఈడీ విచారణకు హాజరైన హీరో విజయ్ దేవరకొండ

విధాత, హైదరాబాద్ : విధాత, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో ఆయన హవాలా ద్వారా డబ్బులు తీసుకున్నట్లుగా ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ బ్యాంకు లావాదేవీలు, ఆర్థికపరమైన అంశాలపై ఈడీ అధికారులు ఆయనను నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.
విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ నేను చేసింది లీగల్ గేమింగ్ యాప్ ప్రమోషన్ అని.. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కాదన్నారు. ఈ రెండిటికి తేడా తెలుసుకొని వార్తలు రాయాలని మీడియాను కోరారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో కూడా విచారణ జరుగుతోందన్నారు. కానీ నన్ను పిలిచింది గేమింగ్ యాప్ ప్రమోషన్ కేసు విచారణ కోసం మాత్రమేనని స్పష్టం చేశారు.
బ్యాంక్ లావాదేవీలు సహా అధికారులు అడిగిన సమాచారమంతా ఇచ్చానన్నారు. అవసరమైతే మరోసారి విచారణకు వస్తానని చెప్పడం జరిగిందన్నారు