Manushi Chhillar | సందీప్‌ వంగా ‘కబీర్‌సింగ్‌’లో హీరోయిన్‌గా నన్నే అడిగారు : మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌

Manushi Chhillar | మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించింది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ చిత్రంతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ‘ఆపరేషన్‌ వాలంటైన్‌’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. వరుణ్‌ తేజ్‌కు జోడీగా మెరిసింది. చివరగా ‘బడే మియా చోటే మియా’ చిత్రంలో నటించింది. అయితే, సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ సినిమా కంటే ముందే తనకు బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చాయని తెలిసింది.

Manushi Chhillar | సందీప్‌ వంగా ‘కబీర్‌సింగ్‌’లో హీరోయిన్‌గా నన్నే అడిగారు : మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌

Manushi Chhillar | మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించింది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ చిత్రంతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ‘ఆపరేషన్‌ వాలంటైన్‌’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. వరుణ్‌ తేజ్‌కు జోడీగా మెరిసింది. చివరగా ‘బడే మియా చోటే మియా’ చిత్రంలో నటించింది. అయితే, సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ సినిమా కంటే ముందే తనకు బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చాయని తెలిసింది. అయితే, బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రంలో అవకాశం వచ్చిందని తెలిపింది. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం కావడం గమనార్హం. సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా వచ్చిన ‘యానిమల్‌’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రణబీర్‌తో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న జతకట్టింది. ఈ మూవీ రూ.900కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. చిత్రంపై విమర్శలు భారీగానే వచ్చినా.. పలువురు సినిమా బాగుందని చెప్పడం విశేషం.

ఇదిలా ఉండగా.. ‘బడే మియా ఛోటే మియా’ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న మానుషి చిల్లర్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన నటనను సవాల్‌ చేసే పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి సినిమాలంటే ఇష్టమని.. ఆయన ప్రాజెక్టుల్లో నటించాలని ఉందని తెలిపింది. యానిమల్‌ మూవీని చూశానని.. అందులో రష్మిక పోషించిన గీతాంజలి పాత్ర నచ్చిందని తెలిపింది. కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు తను చాలా ధైర్యంగా నిలబడిందని.. ఆ క్యారెక్టర్‌లో రష్మిక నటన అద్భుతంగా ఉందని ప్రశంసించింది. తాను అలాంటి పాత్రలే చేయాలనని ఉందని చెప్పింది. తృప్తి డిమ్రి పాత్ర కూడాబాగుందని తెలిపింది. సందీప్‌ వంగా దర్శకత్వంలో తెలుగు అర్జున్‌ రెడ్డి రీమేక్‌గా హిందీలో తెరకెక్కిన ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంలో హీరోయిన్‌గా తనకే ఛాన్స్‌ వచ్చిందని తెలిపింది. షాహిద్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని తెలియక రిజెక్ట్ చేశానని.. అదే సమయంలో తాను మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుపొందినట్లు పేర్కొంది. ఏడాది పాటు ఆ బృందంతో కాంట్రాక్ట్‌ కుదిరిందని.. ఆ కారణంతోనే కబీర్ సింగ్ సినిమా చేయలేకపోయినట్లు తెలిపింది. ఇక మానుసి చిల్లర్‌ బాలీవుడ్‌లో ‘టెహ్రాన్‌’ మూవీలో నటిస్తున్నది.