Mayasabha | తెలుగు రాష్ట్రాలలో హీట్ పెంచుతున్న‘మయసభ’ మూవీ ట్రైలర్
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఉష్ణోగ్రతలు పెంచుతున్న ‘మయసభ’ ట్రైలర్ విడుదలైంది. చంద్రబాబు – వైఎస్సార్ వారసత్వ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ పొలిటికల్ డ్రామా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 7న సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తారాగణంలో ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయికుమార్ ఆకట్టుకుంటున్నారు.
Mayasabha | విధాత: దేవా కట్టా దర్శకత్వంలో ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘మయసభ’సినిమా మూవీ ట్రైలర్ తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ హీట్ పెంచుతుంది. ఇద్దరు స్నేహితులు.. రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారన్న పాయింట్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. అదికూడా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డిల విద్యార్థి, రాజకీయ జీవితంలోని ఘటనల నేపథ్యాన్ని తలపించే కథాంశంతో మయసభ మూవీని తెరకెక్కించారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. గతంలో విడుదలైన టీజర్ మాదిరిగానే మయసభ ట్రైలర్ కూడా భారీ వ్యూస్ సొంతం చేసుకుంటుంది. గురువారం చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్ చూస్తే కృష్ణమనాయుడు, ఎంఎస్ నాయుడు పేర్లతో ఆది పినిశెట్టి, చైతన్యరావు లు చంద్రబాబు, వైఎస్సార్ పాత్రలను రక్తికట్టించినట్లుగా కనబడుతుంది. దివంగత ఎన్టీఆర్ పాత్రలో సీనియర్ నటుడు సాయికుమార్ కనిపించారు.
ఢిల్లీ దర్బార్ కూసాలు కదిలించే మొనగాడు వచ్చాడు..కొడితే రాజును కొట్టాలి..లేదంటే వాని కింద బానిసలా బతకలి అన్న డైలాగ్ లు పొలిటికల్ సెటైరికల్ గా ఆకట్టుకునేలా సాగాయి. ఈ మూవీ నేరుగా ఓటీటీ ‘సోనీలివ్’లో ఆగస్టు 7న రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు అగ్ర రాజకీయ నాయకుల నేపథ్యంతో వస్తున్న మయాసభపై భారీ అంచనాలు ఉన్నట్లుగానే..కథనంలో ఏ మాత్రం ఏ ఒక్క పార్టీ వైపుగాని..నాయకుడి వైపుగాని మొగ్గినట్లుగా కనబడితే మాత్రం అంతే దెబ్బ పడే ప్రమాదం లేకపోలేదన్న టాక్ చిత్ర యూనిట్ ను భయపెట్టేదిగా ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram