Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి సినిమాల్లోకి రాక ముందు ఏం చేసిందో తెలుసా..?

Meenakshi Chaudhary | టాలీవుడ్‌లో ఇప్పుడు మీనాక్షి చౌదరి పేరు తెగ వినిపిస్తున్నది. సుశాంత్‌ హీరోగా వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస ఛాన్స్‌లతో కెరీర్‌లో దూసుకుపోతున్నది.

Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి సినిమాల్లోకి రాక ముందు ఏం చేసిందో తెలుసా..?

Meenakshi Chaudhary | టాలీవుడ్‌లో ఇప్పుడు మీనాక్షి చౌదరి పేరు తెగ వినిపిస్తున్నది. సుశాంత్‌ హీరోగా వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస ఛాన్స్‌లతో కెరీర్‌లో దూసుకుపోతున్నది. మహేశ్‌బాబు గుంటూరు కారం, విజయ్‌ దళపతి గోట్‌ మూవీలతో క్రేజ్‌ అందుకున్నది. తాజాగా నటించిన ‘లక్కీ భాస్కర్‌’ మూవీ రిలీజ్‌ కాగా.. హిట్‌టాక్‌ను సొంతం చేసుకున్నది. స్టార్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీమ్ బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్ 4’ టాక్ షోలో పాల్గొంది. దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి, వెంకీ అట్లూరి, నాగవంశీ పాల్గొనగా.. ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

అయితే, మీనాక్షి చౌదరి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చేందుకు కారణం ఏంటని ప్రశ్నించారు. మీనాక్షిని బదులిస్తూ తాను ఒక డెంటిస్ట్‌ అని చెప్పింది. ఓ సారి మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్నానని.. అందులో విజయం సాధించాక సినిమాల్లోకి వచ్చానని చెప్పింది. ఆ తర్వాత ముంబయిలో వర్క్‌షాప్‌లో పాల్గొన్నానని.. అక్కడే సుశాంత్‌తో పరిచయమైందని.. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని చెప్పింది. తాను విధిని నమ్ముతానంటూ చెప్పుకొచ్చింది. మూవీలోకి రాకముందు డెంటిస్ట్‌గా వర్క్‌ చేసిందని తెలియడంతో నెటిజన్స్‌ షాక్‌ అవుతున్నారు. ప్రస్తుతం వరుస అవకాశాలతో టాలీవుడ్‌లో దూసుకుపోతున్నది. ప్రస్తుతం లక్కీ భాస్కర్‌ రిలీజ్‌ అయ్యింది. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌తో ‘మట్కా’, విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తున్నది మెకానికి రాకీలో నటిస్తున్నది.