Konda Surekha | పార్టీ నుండి సురేఖను బహిష్కరించండి : సినీ పెద్దలు

కేటీఆర్​ను విమర్శించే క్రమంలో అనవసరంగా సినీ నటీమణులను గొడవలోకి లాగి వారి ప్రతిష్టను భంగపరిచిన మహిళా మంత్రి కొండా సురేఖపై సినీ పరిశ్రమ ఆగ్రహావేశాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

Konda Surekha | పార్టీ నుండి సురేఖను బహిష్కరించండి : సినీ పెద్దలు

ముఖ్యమంత్రిని సంతృప్తి పరచడానికి  మీడియా ముందు కేటీఆర్​ను నానా మాటలు అంటూ అందులోకే సినీ హీరోయిన్లను లాగిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha)పై సినీ పరిశ్రమ నిప్పులు చెరుగుతోంది. నిన్నటికి కొంత మందే నిరసన తెలుపగా, నేడు అవి ఇంకా ఎక్కువయ్యాయి. ఇవి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. సినీనటి సమంతను ఉద్దేశించి చేసిన దిగజారుడు వ్యాఖ్యలను సినీ సమాజం తీవ్రంగా పరిగణించింది. అక్కినేని కుటుంబ సభ్యులు(Akkineni family members) అందరూ తీవ్రంగా స్పందించగా, నాగార్జున పరువు నష్టం దావా( Defamation Suit)వేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నేడు మెగాస్టార్​ చిరంజీవి, ఎన్​టీఆర్​,  రామ్​గోపాల్​వర్మ, ఖుష్బూ, రోజా, నాని, మా అసోసియేషన్​.. ఇలా చిత్ర పరిశ్రమ(Telugu fim Industry)  అంతా మూకుమ్మడిగా, ముక్తకంఠంతో , సురేఖ వాడిన భాషను ఎండగట్టింది. ఒక మహిళ అయ్యుండీ, ఇంకో మహిళ గురించి ఇలా ఎలా మాట్లాడిందని, తమకు ఆశ్చర్యంతో పాటు అసహ్యం కూడా కలిగిందని వారంటున్నారు. ఇంతవరకు ఇలా మాట్లాడిన మహిళను తామెప్పుడూ చూడనేలేదని సినీ పెద్దలు వాపోయారు.

కొండా సురేఖ లాంటి సంస్కారం లేని(Culture-less) మనుషులను మంత్రిగా, ఎమ్మెల్యేగా, పార్టీ కార్యకర్తగా ఉంచుకోవడం పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని, ఆమెను తక్షణం కాంగ్రెస్​ నుండి బహిష్కరించాలని సినీ పరిశ్రమ నుండి డిమాండ్లు మొదలయ్యాయి. ఈ విషయంపై మా అసోసియేషన్​, ఫిలిం చాంబర్​ ఆఫ్​ కామర్స్​, నిర్మాతల మండలి లాంటి సంస్థలు అధినేత రాహుల్​ గాంధీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఫిలిం వర్గాల ద్వారా తెలుస్తోంది.

 

Tags: .