నవంబర్ 1న వ‌రుణ్ తేజ్ , లావ‌ణ్య త్రిపాఠి వివాహం ఇట‌లీలోని టుస్కానీలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ వివాహ వేడుక‌కి అల్లు, మెగా ఫ్యామిలీల‌తో పాటు లావ‌ణ్య త్రిపాఠి ఫ్యామిలీ కూడా హాజ‌ర‌య్యారు. పెళ్లి వేడుక అత్యంత అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.ఒక్కో ఫోటో బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా, వాటిని చూసి మెగా అభిమానులే కాక సినీ ప్రియులు సైతం తెగ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే తాజాగా నాగ‌బాబు త‌న ఇద్దరు బ్ర‌ద‌ర్స్‌తో క‌లిసి దిగిన ఫొటోని ఒక‌టి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పిక్ లో నాగ‌బాబుతో పాటు చిరు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఉన్నారు.

వ‌రుణ్ పెళ్ళిలో చిరంజీవి, నాగబాబు , పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. మా మధ్య ఎన్ని విభేదాలు, వాదనలు రెగ్యులర్ గా వచ్చినా కూడా మా బంధం మాత్రం ఎప్పటికి ప్రత్యేకంగా ఉంటుంది అని నాగ‌బాబు త‌న పోస్ట్‌లో రాసుకొచ్చారు. మేము చేసిన పనులు, మా జ్ఞాపకాలు మాత్రమే కాదు, మా మధ్య ఏర్పడే విభేదాల కంటే మా అనుబంధం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. మా రిలేషన్ షిప్ ఎన్నో మంచి క్షణాలపై ఆధారపడి ఉంది. మా మధ్య రిలేషన్ నిజంగా చాలా బలమైనది, విడదీయలేనిది అంటూ నాగ‌బాబు త‌న ఇన్‌స్టా పోస్ట్‌లో చాలా ఎమోష‌నల్‌గా రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం మెగా బ్రదర్స్ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

ఇక రామ్ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటో కూడా వైర‌ల్‌గా మార‌డం చూసాం. ఇద్ద‌రు క్యూట్ స్మైల్‌తో అలా న‌డుచుకుంటూ వ‌స్తుండ‌గా, దానిని కెమెరాలో బంధించారు. ఆ ఫొటో ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక వరుణ్ తేజ్ పెళ్ళిలో మెగా ఫ్యామిలీ సంబరాలు హైలైట్ గా నిలిచాయి. తన తమ్ముడు నాగబాబు కొడుకు పెళ్ళికి చిరు కుటుంబ పెద్దగా వ్యవహరించ‌డం మ‌నం చూశాం. పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ పిల్లాపాపలతో సందడి చేశారు. వైష్ణవ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ ఇలా ప్రతి ఒక్కరూ వరుణ్ పెళ్ళికి హాజరై హంగామా చేశారు. నిహారిక పెళ్లి రోజు వేదిక వ‌ద్ద డ్యాన్స్ చేసి హ‌డావిడి చేసింది.

sn

sn

Next Story