Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ఉద్యోగుల‌కు ప‌దోన్న‌తులు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Dec 06, 2025 6:11 AM IST
Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ఉద్యోగుల‌కు ప‌దోన్న‌తులు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ప్రయోజకరంగా ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అనేక మార్గాల నుంచి ఆదాయం పెరగడంతో ఆర్థికంగా బలోపేతం అవుతారు. కీలక నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరమైన ప్రయాణాలు అనుకూలిస్తాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు. ఇంటా బయట కలహపూరిత వాతావరణం ఉండవచ్చు. సాధ్యమైనంత వరకు కోపావేశాలు తగ్గించుకుని మౌనంగా, ప్రశాంతంగా ఉండటం మంచిది. కీలక నిర్ణయాల్లో స్థిరత్వం అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మంచిది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ స్వధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అందరినీ కలుపుకుని పోవడం వలన ప్రయోజనం ఉంటుంది. వ్యాపారంలో ముఖ్యమైన పనులు వెంటనే చేయడం వలన లాభాలు పెరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. కుటుంబ సభ్యులతో కలహాలు రాకుండా మాట అదుపులో ఉంచుకోండి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఎంతో కాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. వ్యాపారంలో విజయం ఉంటుంది. సంపదలు పెరుగుతాయి. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు అధిగమించి ధైర్యంగా ముందడుగు వేస్తారు. క్రమశిక్షణ, సమయపాలనతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఈ రోజు కొత్తగా వ్యాపారం, ఉద్యోగం ఏది ప్రారంభించిన విజయం సిద్ధిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు మంచి లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. వృత్తినిపుణులు, ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహ సంచారం మిశ్రమంగా ఉన్నప్పటికీ శ్రద్ధగా ముందుకు సాగితే మేలైన ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగంలో విచక్షణతో వ్యవహరించాలి. అనుకున్న ప్రకారం పనులు జరగకపోవచ్చు. సహనం వహించాలి. కొత్త ప్రాజెక్టులు, ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తే మంచిది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఈ రోజంతా సంతోషంగా, ఆహ్లదంగా సాగిపోతుంది. విదేశీయుల సాంగత్యంలో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆశ్చర్యం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తాడు. కుటుంబం వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది. పెరిగిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఒక వార్త మనస్థాపం కలిగిస్తుంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ప్రతి పనిలోనూ ముందుజాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉండవచ్చు కాబాట్టి వాయిదా వేయండి. కుటుంబ కలహాలతో ఆందోళన చెందుతారు. శాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలు ఫలించవు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అనేక సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా కఠినమైన సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి క్షీణించే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో మితిమీరిన ఆత్మవిశ్వాసం సమస్యలు సృష్టించవచ్చు. పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.