‘Vibe Undi’ Song Addded To Mirai Movie | మిరాయ్ లో వైబ్ ఉంది బేబీ పాట వచ్చేసిందోచ్

మిరాయ్ మూవీ లో ‘వైబ్ ఉంది బేబీ’ పాటను యాడ్ చేశారు. ఫ్యాన్స్ డిమాండ్ పై పాటను తియేటర్స్ లో చూడవచ్చు.

‘Vibe Undi’ Song Addded To Mirai Movie | మిరాయ్ లో వైబ్ ఉంది బేబీ పాట వచ్చేసిందోచ్

విధాత, : తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలోతెరకెక్కిన చిత్రం మిరాయ్. మంచు మనోజ్ విలన్ గా, రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అయితే సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉందిలే సాంగ్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ పాట లేకుండానే సినిమాను విడుదల చేశారు. సినిమాలో పాట లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. సినిమా నిడివి తగ్గించడంతో పాటు సూపర్ హీరో కథనానికి అడ్డుగా ఇరికించినట్లుగా ఉన్నాయని భావించి వైబ్ ఉంది బేబి పాటను, మరో పాటను కూడా తొలగించారు. చిత్రంగా సినిమా విడుదల తర్వాత సక్సెస్ మీట్ లలో సైతం వైబ్ ఉంది బేబి పాటనే ఫేమస్ కావడం…ప్రేక్షకులు ఆ పాటను సినిమాలో పెట్టాలని డిమాండ్ చేయడంతో మేకర్స్ ఎట్టకేలకు తమ నిర్ణయం మార్చుకున్నారు.

తాజాగా మిరాయ్ మూవీలో వైబ్ ఉంది బేబీ పాటను యాడ్ చేశారు. దీంతో ప్రేక్షకులు మరోసారి ఈ పాట కోసం మిరాయ్ సినిమాను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తద్వార తమ సినిమాకు కలెక్షన్లు పెరుగుతాయని మేకర్స్ భావిస్తున్నారు. మేకర్స్ కలెక్షన్ల థియరీ ఎలా ఉన్నా..ఇప్పటికే హీరోయిన్ రితికా నాయక్ అందానికి ఫిదా అయిపోయిన అభిమానులు థియేటర్స్ కు వెళ్లి వెండితెరపై వైబ్ ఉంది బేబి పాటను చేసి ఆనందిస్తున్నారు. ‘వైబ్‌ ఉంది బేబీ’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్‌ లిరిక్స్‌ అందించగా, అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు. తేజ సజ్జా, రితికా నాయక్ లు తమ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. మిరాయ్ ప్రస్తుతం రూ.150కోట్ల వసూళ్ల దిశగా దూసుకెలుతుంది.