Delhi Telangana Bhavan Andhra Officials | పేరుకు తెలంగాణ భవన్.. పనిచేసేవారంతా ఆంధ్రప్రదేశ్‌వారే!

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ అంటే.. తెలంగాణ రాష్ట్రానిది. ఇక్కడ అంతా తెలంగాణ అధికారులు, సిబ్బందే ఉండాలి. కానీ.. ఆంధ్ర నుంచి డిప్యూటేషన్‌పై అక్కడివారిని తీసుకురావడం వివాదాస్పదమవుతున్నది.

Delhi Telangana Bhavan Andhra Officials | పేరుకు తెలంగాణ భవన్.. పనిచేసేవారంతా ఆంధ్రప్రదేశ్‌వారే!

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24 (విధాత):

Delhi Telangana Bhavan Andhra Officials | తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం! కానీ.. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ నిరుద్యోగులకు అదీ.. అక్కడి ఉన్న తెలంగాణ భవన్‌లో అన్యాయం జరుగుతున్నది. డిప్యూటేషన్‌ పేరిట ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల వారిని వివిధ హోదాల్లో తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఆంధ్ర అధికారుల పెత్తనం కొనసాగుతుండటం గమనార్హం. ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనీసం తెలంగాణ భవన్‌లో జరుగుతున్న విషయాలను కూడా పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.

రెసిడెంట్‌ కమిషనర్‌కన్నా ఆమె పవర్‌ఫుల్‌!

తెలంగాణ భవన్‌లో రెసిడెంట్ కమిషనర్ కన్నా ఒక మహిళా అధికారి అజమాయిషీ చెలాయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పక్క రాష్టమైన ఏపీ ప్రభుత్వంలో రాజమండ్రి డిగ్రీ కాలేజీలో స్టోర్ కీపర్‌గా పని చేస్తున్న మహిళా ఉద్యోగిని తెలంగాణ భవన్‌కు ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్‌పై తీసుకొచ్చేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సదరు మహిళకు అనుమతినిస్తూ జీవోసైతం వారం క్రితమే జారీ చేసింది. రేపో మాపో ఆమె తెలంగాణ భవన్‌లో ఉగ్యోగంలో చేరనున్నారని తెలుస్తున్నది. ఢిల్లీ తెలంగాణా భవన్ లో గతంలో ఎందరో తెలంగాణ బిడ్డలు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని అర్జీలు పెట్టుకున్నారు. వారిని కాదని పక్క రాష్ట్రం మహిళను తెప్పించేందుకు ఆమె ప్రయత్నించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. పైగా అవసరం లేకున్నా డిప్యూటేషన్‌పై తీసుకురావడాన్ని నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. రెసిడెంట్‌ కమిషనర్‌, ప్రభుత్వంలో పెద్దలు కూడా చోద్యం చూస్తూ ఏపీ వారికి అవకాశాలు కల్పిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా పొరుగు రాష్ట్రంలో స్టోర్‌ కీపర్‌గా పనిచేసే మహిళను ఢిల్లీకి రప్పించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు నిరుద్యోగులు. తెలంగాణలో ఆ బాధ్యతలు నిర్వహించగల ఎందరో ఉన్నా.. ప్రత్యేకించి ఆమెను తీసుకురావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇతర ఉద్యోగాలూ అంతే

ఇతర ఉద్యోగాల పరిస్థితి కూడా అలానే తయారైందని అంటున్నారు. ఆంధ్రలో రిటైర్‌ అయిన వ్యక్తికి తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ పేషీలో కీలకమైన అకౌంట్స్‌ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ భవన్‌లో ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకపోగా.. పక్క రాష్ట్రం వారికి సహకరించడమేంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రెసిడెంట్‌ కమిషనర్‌ను మించి ఆ మహిళా అధికారి ఎందుకు పెత్తనం చేస్తున్నారని నిలదీస్తున్నారు. సదరు మహిళా అధికారి భర్త ఏపీ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉండటంతోనే ఆమె చెప్పినట్టు తెలంగాణ భవన్‌లో నియామకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వ్యవహారాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కనీసం దృష్టి సారించడం లేదన్న వాదనలు ఉన్నాయి. కనీసం అక్కడ ఏం జరుగుతున్నదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిండం లేదని అంటున్నారు. దీంతో తెలంగాణ భవన్‌లో ఆంధ్ర హవా కొనసాగుతున్నదని చెబుతున్నారు. తెలంగాణ భవన్‌లో పనిచేసే దళిత అధికారులకు సైతం అన్యాయం జరుగుతున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

Maoist party latest Clarification | ప్రజలకు ద్రోహం చేయలేం! ఆయుధాల అప్పగింత మా విధానం కాదు: మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన
Land Grabbers Rampalli Village | ఎన్ఆర్ఐ మ‌హిళకు చెందిన భూమి.. దర్జాగా క‌బ్జా! మంత్రి అండతోనే?
Fourth Century Roman Bronze Coins | నాలుగో శతాబ్దం నాటి 50వేల పురాతన నాణేల నిధిని వెలికి తీసిన డైవర్‌!