Mr Bachchan|బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్‌గా మారిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్.. రెండో రోజే ఇంత దారుణ‌మైన క‌లెక్ష‌న్సా..!

Mr Bachchan| టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్ చిత్రం ఆగ‌స్ట్ 15న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే . హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని

  • By: sn    cinema    Aug 17, 2024 2:00 PM IST
Mr Bachchan|బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్‌గా మారిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్.. రెండో రోజే ఇంత దారుణ‌మైన క‌లెక్ష‌న్సా..!

Mr Bachchan| టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్ చిత్రం ఆగ‌స్ట్ 15న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే . హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమా పాటలు ఆకట్టుకోవడం, ట్రైలర్ బాగుండటంతో అంచనాలు పెరిగాయి. అయితే ప్రీమియర్స్ నుండే మిస్టర్ బచ్చన్ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

మిస్టర్ బచ్చన్ సినిమాలో అవ‌స‌రం అయిన వాటికంటే అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బాలీవుడ్ మూవీ రైడ్‍కు రీమేక్‍గా ఈ చిత్రాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించారు. అయితే, బోలెడు మార్పులు చేశారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా తీర్చిదిద్ద‌డంతో మూవీ తేలిపోయింది. చేసేది ఏం లేక చిత్ర బృందం ర‌న్ టైమ్ త‌గ్గించే ఆలోచ‌న చేసింది.13 నిమిషాల రన్‍టైమ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ నేడు అధికారికంగా వెల్లడించింది. ఇక ఇదిలా ఉంటే తొలి రోజు దారుణ‌మైన క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా బాగా డౌన్ అయిపోయింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.30 కోట్లు మాత్రమే షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1.75 కోట్లు వసూలు చేసుకుంది. ఇలా రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 8 కోట్లు షేర్ కలెక్ట్ చేసుకుంది.

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 32 కోట్లు కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా రూ. 6.14 కోట్ల షేర్‌, రూ. 9.45 గ్రాస్ కలెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది. బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ కొట్టాలంటే మొద‌టి రెండు రోజులు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా రూ. 25.86 కోట్ల షేర్ ను వ‌సూల్ చేయాల్సి ఉంటుంది. ఇది అసంభ‌వ‌మే అంటున్నారు సినీ విశ్లేష‌కులు..