Allu Arjun- Atlee Film : అల్లు అర్జున్ సినిమాలో దీపికా కాదు…మృణాల్ ఠాకూర్ మెయిన్ లీడ్
అల్లు అర్జున్ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా దీపికా కాదు.. మృణాల్ ఠాకూర్ ఎంపికైనట్టు ఫిల్మ్ సర్కిల్ టాక్ వైరల్ అవుతోంది.

విధాత : అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఏఏ 22వర్కింగ్ టైటిల్ సినిమాలో దీపికా పదుకుణే నటిస్తున్నప్పటికి మెయిన్ హీరోయిన్ పాత్ర మృణాల్ ఠాకూర్ దేనని ఫిల్మ్ సర్కిల్ టాక్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కథ ప్రధానంగా అల్లు అర్జున్, మృణాల్ ఠాకూర్ చుట్టు తిరుగుతందని సమాచారం. దీపికా పదుకుణేకి ఈ మూవీలో చాలా తక్కువ స్క్రీన్ సమయం మాత్రమే ఉంటుందట. అల్లు అర్జున్ మూవీలో షూటింగ్ సమయంలోనే కల్కీ సీక్వెల్ షూటింగ్ చేయాలని దర్శకుడు నాగ్ ఆశ్విన్ అనుకోవడంతోనే డేట్స్ అడ్జస్ట్ చేయలేక కల్కీ నుంచి దీపికా తప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తుంది.
దీపికా అల్లు అర్జున్ మూవీకి ప్రాధాన్యం ఇవ్వడంతో.. తప్పని పరిస్థితుల్లో ‘కల్కి’ సీక్వెల్ నుండి తొలగించారనే టాక్ కూడా వైరల్ అవుతుంది. మరో ప్రచారంలో దీపికా పదుకుణే రూ.30కోట్ల రెమ్యూనరేషన్ అడిగారని..అందుకే కల్కీ 2 నుంచి తప్పించారన్న టాక్ కూడా వినిపిస్తుంది. అసలు కారణమేంటన్నది దీపికా నోరు విప్పితేగాని స్పష్టత రానుంది.