Nayanthara| సెట్‌లోనే న‌య‌న‌తార ష‌ర్ట్ చేంజ్ చేయ‌మ‌న్న డైరెక్టర్.. చేసేదేం లేక కారు వెన‌క్కు వెళ్లి…!

Nayanthara| సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖుల జీవితాలు చూడ‌డానికి బ‌య‌ట‌కు బాగానే క‌నిపిస్తున్నా వారు ఎన్నో బాధ‌లు, క‌ష్టాలు అనుభ‌వించి ఉంటారు. చిరంజీవి వంటి వారు మెగాస్టార్ కావ‌డానికి ఎన్ని క‌ష్ట‌న‌ష్టాలు చ‌వి చూశారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక అలానే లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఈ స్థా

  • By: sn    cinema    Jun 17, 2024 2:23 PM IST
Nayanthara| సెట్‌లోనే న‌య‌న‌తార ష‌ర్ట్ చేంజ్ చేయ‌మ‌న్న డైరెక్టర్.. చేసేదేం లేక కారు వెన‌క్కు వెళ్లి…!

Nayanthara| సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖుల జీవితాలు చూడ‌డానికి బ‌య‌ట‌కు బాగానే క‌నిపిస్తున్నా వారు ఎన్నో బాధ‌లు, క‌ష్టాలు అనుభ‌వించి ఉంటారు. చిరంజీవి వంటి వారు మెగాస్టార్ కావ‌డానికి ఎన్ని క‌ష్ట‌న‌ష్టాలు చ‌వి చూశారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక అలానే లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఈ స్థాయికి చేరుకోవడానికి కూడా చాలా క‌ష్ట‌ప‌డింద‌ట‌. ఇప్పుడు టాప్ హీరోల‌కి సమానంగా క్రేజ్ ఉండ‌గా, ఒక‌ప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంద‌ట‌. ఆమెని సెట్‌లో డైరెక్ట‌ర్ దారుణంగా అవ‌మానించిన చేసేదేం లేక చెప్పిన‌ట్టు వినింది. అప్ప‌ట్లో కార‌వ్యాన్ లేక‌పోవ‌డంతో అంద‌రి ముందే బ‌ట్ట‌లు కూడా మార్చుకుంద‌ట‌. ఈ విష‌యం ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది.

న‌య‌న‌తారకి ఎదురైన విచిత్ర పరిస్థితిని ఓ జర్న‌లిస్ట్ తాజాగా పంచుకున్నారు. గ‌జినీ సినిమా షూటింగ్ సెట్స్‌లో ఆమెకి ఎదురైన అనుభ‌వం గురించి తెలియ‌జేశాడు. ‘ చెన్నై వైఎంసీఏ గ్రౌండ్ లో గజినీ సినిమా షూటింగ్ జరుగుతుండ‌గా, అప్పుడు నయనతారని విలన్లు వెంబడించే సన్నివేశాన్ని మురుగదాస్ చిత్రీకరించారు. ఆ సీన్ లో నయనతార పరిగెడుతున్నప్పుడు ద‌ర్శ‌కుడు స‌డెన్‌గా క‌ట్ చెప్పాడు. అప్పుడు న‌య‌న‌తార వేసుకున్న ష‌ర్ట్ కాస్త అస‌భ్య‌క‌రంగా ఉండ‌డంతో మార్చ‌మ‌ని చెప్పాడ‌ట‌. అయితే అప్పుడు న‌య‌న‌తార‌.. ‘నేను వేరే బట్టలు కూడా తీసుకురాలేదు. కనీసం మార్చుకోవడానికి క్యారవాన్ కూడా లేదు’ అని డైరెక్టర్ తో చెప్పింది.

అప్పుడు ముర‌గ‌దాస్ అసిస్టెంట్ వెళ్లి వేరే ష‌ర్ట్ కొని తీసుకొచ్చాడు. అప్పుడు చేసేదేం లేక పార్క్ చేసి ఉన్న కారు వెన‌క్కి వెళ్లి ష‌ర్ట్ మార్చుకుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అది ఆమె కెరీర్ బిగినింగ్ కావ‌డంతో ద‌ర్శ‌కుడు ఆమెకి గౌర‌వం ఇవ్వ‌లేద‌ని అన్నాడు. ఇప్పుడు ఆయ‌న చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక న‌య‌న‌తార ఇప్పుడు ఎంత స్టార్ డం సంపాదించుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గత ఏడాది జవాన్ మూవీతో బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నయనతార నటనకు గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇప్పుడు మరో హిందీ మూవీలో ఆమె నటించనున్నట్టు టాక్. ప్రస్తుతం మన్నం గట్టి, టెస్ట్ సినిమాల్లో నయనతార నటిస్తున్నారు.