Naga Chaitanya| రాష్ట్రపతి వద్ద జాబ్ చేయాలని కలలు కన్న నాగ చైతన్యకి కాబోయే భార్య
Naga Chaitanya| అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి జీవితం మున్నాళ్ల ముచ్చటగానే మారింది. నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకొని సపరేట్ అయ్యారు. ఆ తర్వాత నాగ చైతన్య మరో టాలీవుడ్ హీరో శోభిత ధూళిపాళ్లతో సీక్రెట్ ప్రేమాయణం నడిపి ఎట్టకేలకి ఇటీవల ఆమెతో నిశ్చితార్థం జరుపుకున్నాడు. దీంతో శోభిత పేరు నెట్టింట తెగ మారుమ్రోగిపోతుంది. ఆమె గురించి జనాలు తెగ వెతి

Naga Chaitanya| అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి జీవితం మున్నాళ్ల ముచ్చటగానే మారింది. నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకొని సపరేట్ అయ్యారు. ఆ తర్వాత నాగ చైతన్య మరో టాలీవుడ్ హీరో శోభిత ధూళిపాళ్లతో సీక్రెట్ ప్రేమాయణం నడిపి ఎట్టకేలకి ఇటీవల ఆమెతో నిశ్చితార్థం జరుపుకున్నాడు. దీంతో శోభిత(sobhita dhulipala) పేరు నెట్టింట తెగ మారుమ్రోగిపోతుంది. ఆమె గురించి జనాలు తెగ వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలో శోభిత కూడా తనకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది.డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టానని, ఆ సమయంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయంటూ పేర్కొంది.
తాను నల్లగా ఉండడంతో నువ్వు మోడల్ ఏంటి కనీసం బ్యాక్ గ్రౌండ్ మోడల్‌గా కూడా పనికిరావు అంటూ హేళన చేశారని పేర్కొంది. ఆ ఆడిషన్ తర్వాత ఇంటికి వచ్చి అద్దం ముందు నన్ను నేను చూసుకుంటూ చాలా ఏడ్చినట్టు కూడా శోభిత తెలియజేసింది. అయితే అందం అనేది మ్యాటర్ కాదని తెలుసుకొని ఎవరేమనుకున్నా తన పని తాను చేసుకోవాలని ఆడిషన్స్‌కి వెళ్తూ ప్రయత్నాలు చేశానని తెలిపారు.ఏ షాంపూ కంపెనీ అయితే నన్ను ఆడిషన్స్‌లో అవమానించి రిజెక్ట్ చేసిందో అదే షాంపూ కంపెనీ(Shampoo Company) తన సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయాలని నన్ను కోరారని శోభిత పేర్కొంది. అయితే హీరోయిన్ కావాలనేది శోభితా డ్రీమ్ కాదు. ఎకనమిస్ట్ కావాలని శోభిత కలలు కన్నదట. రాష్ట్రపతి(President) వద్ద పనిచేయాలని, రాష్ట్రపతికి చీఫ్ ఎకనమిస్ట్ అడ్వెయిజర్‌గా జాబ్ చేయాలని శోభిత ఎన్నో ఊహించుకుందట.
తన ఫ్రెండ్స్ హీరోల గురించి, సినిమాల గురించి మాట్లాడుకుంటుంటే, తాను మాత్రం ఎకనమిస్ట్ లు ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్, చిదంబరం, శశిథరూర్‌ల గురించి మాట్లాడేదట. దీంతో అందరు తనని విచిత్రంగా చూసేవాళ్లంటూ శోభిత ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. బాలీవుడ్(Bollywood) మూవీ `రామన్ రాఘవ్ 2.0` సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన శోభితా దూళిపాళ.. తెలుగులో `గూఢచారి`, `మేజర్` చిత్రాల్లో నటించింది. హిందీలో `చెఫ్`, `కాలకాండి`, `ది బాడీ`తోపాటు తమిళంలో `పొన్నియిన్ సెల్వన్ ` రెండు భాగాల్లో, అలాగే మలయాళంలో `కురుప్` చిత్రంలో నటించి మెప్పించింది. ఇటీవలే ఆమె నటించిన `లవ్ సితార` మూవీ థియేటర్లోకి రాగా, ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. త్వరలో శోభిత .. నాగ చైతన్య(Naga Chaitanya)తో కలిసి ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది.