Nara Rohit | హీరోయిన్‌నే పెళ్లాడనున్న నారా రోహిత్.. రెండురోజుల్లోనే ఎంగేజ్‌మెంట్..!
నటుడు నారా రోహిత్ (Nara Rohit) త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. టాలీవుడ్ (Tollywood)లో మోస్ట్ ఎలిజుబుల్ బ్యాచిలర్లలో ఒకరైన రోహిత్ త్వరలోనే.. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారు.
Nara Rohit | నటుడు నారా రోహిత్ (Nara Rohit) త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. టాలీవుడ్ (Tollywood)లో మోస్ట్ ఎలిజుబుల్ బ్యాచిలర్లలో ఒకరైన రోహిత్ త్వరలోనే.. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారు. రెండురోజుల్లోనే ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఆయన సినిమాలో నటించిన హీరోయిన్‌నే పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తున్నది.
ప్రతినిధి-2 మూవీలో హీరోయిన్‌గా నటించిన సిరి లేళ్ల (Siri Lella) నారా రోహిత్ మనువాడనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోనే నిశ్చితార్థం వేడుక జరుగనున్నదని తెలుస్తున్నది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ కుటుంబాలు హాజరుకానున్నాయి. రోహిత్‌కు హీరోయిన్ సిరితో వివాహం జరగడానికి కారణం నారా భువనేశ్వరి అని తెలుస్తున్నది.
నాలుగు పదుల వయసుకు చేరడంతో.. ప్రతినిధి-2 మూవీలో జోడీ బాగా కుదరడంతో ఇరు కుటుంబాలతో మాట్లాడి పెళ్లికి ఒప్పించినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ నెల 13న నిశ్చిర్థానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే, పెళ్లి కార్యక్రమానికి ఇప్పటి వరకు ఇరు కుటుంబాలు అధికారికంగా ప్రకటించలేదు. నారా రోహిత్ చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు తనయుడు. ‘బాణం’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల ప్రతినిధి-2 మూవీలో తెరపై కనిపించారు. ప్రస్తుతం సుందరకాండ మూవీలో బిజీగా ఉన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram