Nivetha Pethuraj| పోలీసుల‌తో నివేదా గొడ‌వ‌.. ఆ డిక్కీ గోలేంటో ఇప్ప‌టికి క్లారిటీ వ‌చ్చింది..!

Nivetha Pethuraj| ఇటీవ‌ల ప్ర‌మోష‌న్స్ పేరుతో మేక‌ర్స్ విచిత్ర ప్ర‌యోగాలు చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. కొన్ని సార్లు వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన మ‌రి కొన్ని సార్లు బెడిసి కొడుతున్నాయి.ఇటీవ‌ల నివేదా పెతురాజ్ అనే భామ పోలీసుల‌తో గొడ‌వ ప‌డుతూ నానా ర‌చ్చ చేసింది. ఇది చూసి కొంద‌రు ఏదో విష‌యంలో బుక్ అయింద‌ని అంటే, మ‌రి కొంద‌రు ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇలా చేసిందని అంటున్నారు. చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇ

  • By: sn    cinema    Jun 01, 2024 8:05 AM IST
Nivetha Pethuraj| పోలీసుల‌తో నివేదా గొడ‌వ‌.. ఆ డిక్కీ గోలేంటో ఇప్ప‌టికి క్లారిటీ వ‌చ్చింది..!

Nivetha Pethuraj| ఇటీవ‌ల ప్ర‌మోష‌న్స్ పేరుతో మేక‌ర్స్ విచిత్ర ప్ర‌యోగాలు చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. కొన్ని సార్లు వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన మ‌రి కొన్ని సార్లు బెడిసి కొడుతున్నాయి.ఇటీవ‌ల నివేదా పెతురాజ్ అనే భామ పోలీసుల‌తో గొడ‌వ ప‌డుతూ నానా ర‌చ్చ చేసింది. ఇది చూసి కొంద‌రు ఏదో విష‌యంలో బుక్ అయింద‌ని అంటే, మ‌రి కొంద‌రు ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇలా చేసిందని అంటున్నారు. చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని పాపులర్ అయిన నివేదా పేతురాజ్ మంచి హిట్స్ ద‌క్కించుకుంది. ఆ మధ్య విశ్వక్ సేన్‌తో ‘పాగల్’ అనే చిత్రంలో నటించింది. ఈ క్రమంలోనే గత ఏడాది ‘దాస్ కా ధమ్కీ’ అనే చిత్రంతో మరోసారి అతడితో జతకట్టి మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది.

ప్ర‌స్తుతం పార్టీ అనే త‌మిళ చిత్రంలో న‌టిస్తుంది. అయితే ఈ భామ మూడు రోజుల క్రితం పోలీసులతో గొడవపడుతున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది. నివేదా కారులో వెళ్తుండగా.. ఆమె కారును పోలీసులు ఆప‌డం.. డిక్కీ ఒపెన్ చేయాలని చెబితే పరువుకు సంబంధించిన విషయం అంటూ వారితో గొడ‌వ‌ప‌డ‌డం మనం చూశాం. డిక్కీ ఓపెన్ చెయ్య‌మంటే ఇది నా ప‌రువుకు సంబంధించిన విష‌యం అంటూ పోలీసుల‌తో వాదించింది. కెమెరాతో షూట్ చేస్తుంటే కెమెరాని కూడా ప‌క్క‌కి నెట్టేసింది. దీంతో అస‌లు ఈ గొడ‌వ ఏంటి, నివేదా ఎందుకు ఇలా చేస్తుంది, ఆమె ఏ వివాదంలో ఇరుక్కుంద‌ని అంతా తెగ చ‌ర్చించుకోవ‌డం మొద‌లు పెట్టారు.

అయితే నివేదా పోలీసుల‌తో గొడ‌వ ప‌డ‌డానికి కార‌ణం జీ5 వారు షేర్ చేసిన వీడియోతో తెలిసిపోయింది. జీ5 నివేదా పోలీసులతో గొడవ పడిన వీడియోను షేర్ చేస్తూ పరువు పేరుతో కొత్త సినిమా రాబోతుందంటూ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. చిత్రంలో నివేదా పెతురాజ్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, ఆమెతో ఇలా ప్ర‌మోష‌న్ వీడియో రూపొందించారు. జూన్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. దీంతో నివేదా పోలీసుల గొడవ అంతా పబ్లిసిటీ స్టంట్ అని తేలడంతో ఆమెని తెగ ట్రోల్ చేస్తున్నారు.