OG Movie Review | ఓజస్​ పవన్ కళ్యాణ్ మాస్ పవర్​ నచ్చిందా?

సెప్టెంబర్ 25న విడుదలైన ‘OG’ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగలా మారింది. యాక్షన్, థమన్ BGM, ఎమ్రాన్ హాష్మీ విలన్ రోల్ ఆకట్టుకున్నాయి. అయితే కథ, క్లైమాక్స్ బలహీనత వల్ల పూర్తి థ్రిల్ ఇవ్వలేకపోయింది. విధాత రేటింగ్: 3.25/5.

OG Movie Review | ఓజస్​ పవన్ కళ్యాణ్ మాస్ పవర్​ నచ్చిందా?

OG Movie Review | నిన్న విడుదలైన ప్రీమియర్​ షోలు, కొద్దిసేపటి క్రితం దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ‘OG’ (They Call Him OG) సినిమా ఇప్పుడు థియేటర్లలో దద్దరిల్లుతోంది. పవర్​స్టార్​ అభిమానులకు పూనకాలు వస్తున్నాయి.  DVV ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌లో భారీ ఓపెనింగ్స్​తో మొదలైంది. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కు ఈ రెండు రోజులు పండుగలా మారిపోయాయి. ఎమ్రాన్ హాష్మీ తెలుగులో విలన్‌గా పరిచయం, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ ఇతర నటీనటవర్గం. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ కథలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన గ్యాంగ్​స్టర్​ ఓజస్ గంభీర (పవన్) 10 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి, ఓమి భౌ (ఎమ్రాన్)తో పోరాడతాడు. అసలు ఓజస్​ ఎవరు? అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాల్సివచ్చింది? మళ్లీ తిరిగి ఎందుకు వచ్చాడు? అనేది మిగతా కథాంశం.

OG సినిమా రివ్యూ: పవన్ కళ్యాణ్, ఎమ్రాన్ హాష్మీ స్టిల్ – యాక్షన్ థ్రిల్లర్ పోస్టర్

ఓజీ మొదటి హాఫ్ గూస్‌బంప్సే

‘OG (They Call Him OG)’ ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ సునామీ సృష్టిస్తోంది. సుజీత్ దర్శకత్వంలో, DVV ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా పూర్తిగా పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం తయారైనదనే చెప్పాలి. మొదటి హాఫ్ నుంచే సినిమా మాస్ ట్రీట్​మెంట్​లోకి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ ఇంట్రో ఫైట్, ఇంటర్వల్ బ్యాంగ్​ థియేటర్లలో దద్దరిల్లాయి. అన్నీ గూస్‌బంప్స్ లెవల్‌లో డిజైన్ చేసారు. పవన్​ మార్షల్ ఆర్ట్స్‌తో యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా మెరిసాడు. థమన్ BGM సినిమాను ఒంటిచేత్తో మోసింది. రవి కె. చంద్రన్ కెమెరా వర్క్ స్టైలిష్‌గా ఉంది. ఫ్యాన్స్ “పవన్ స్వాగ్ బెస్ట్ ఎవర్” అని చెబుతున్నారు. టైటిల్ కార్డ్, యాక్షన్​ ప్యాక్​ మాస్ అప్పీల్​  ఇస్తాయి. అయితే, కొన్ని సీన్స్​లో భావోద్వేగాలు అంతగా పండలేదు.

ఎమ్రాన్ హాష్మీ పరిచయం అదిరింది

ఎమ్రాన్ హాష్మీ తెలుగులో మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓమి భౌ పాత్రలో అతని నటన, పవన్​తో ఢీకొనే తీరు చాలా గొప్పగా ఉంది. ఆ పాత్ర ఇంకెవరూ చేయలేరన్నట్లుగా నటించాడు.  లుక్, పవన్‌తో ఫైట్ సీన్స్ థియేటర్లలో మంచి రియాక్షన్ చూపించాయి.  ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ ఇతరపాత్రలు పోషించారు కానీ, వీరి పాత్రలకు స్కోప్​ తక్కువగా ఉంది. ఎమోషనల్ సీన్స్ కొంత సాదాసీదాగా  ఉన్నాయి.

OG సినిమా రివ్యూ: పవన్ కళ్యాణ్, ఎమ్రాన్ హాష్మీ స్టిల్ – యాక్షన్ థ్రిల్లర్ పోస్టర్

సినిమా బలాలు మరియు బలహీనతలు

సినిమా యాక్షన్ సీన్స్, పవన్ స్వాగ్, ఎమ్రాన్ ఫైట్‌లు బలాలు. థమన్ సంగీతం, రవి కె. చంద్రన్ కెమెరా వర్క్ గొప్పగా ఉన్నాయి. సుజీత్ పవన్‌ను మాస్ హీరోగా చూపించాడు. కానీ కథను ఇంకాస్తా బలంగా రాసుకుంటే బాగుండేది. పూర్తిగా పవన్​కళ్యాణ్​ ఎపిసోడ్ల మీదే ఫోకస్​ పెట్టడం వల్ల  కొంచెం బలహీనంగా ఉంది. సెకండ్ హాఫ్‌,  క్లైమాక్స్ ఊహించినట్లే ఉన్నాయి. మామూలు ప్రేక్షకులకు అందరినీ అలరించలేకపోయినా, పవన్​కళ్యాణ్​ అభిమానులకు మాత్రం పండుగే.

విధాత రేటింగ్: 3.25/5

మొత్తంగా, ‘OG’ ఫ్యాన్స్​ను ఉద్దేశించే బాగా తీసిన సినిమా.

పవన్ కళ్యాణ్ యాక్షన్, స్వాగ్ : 4/5

స్టోరీ, క్లైమాక్స్ : 2.5/5.

ఎమ్రాన్ హష్మీ ఆకర్షణ : 4/5

థమన్ BG : 4/5

టెక్నికల్ వర్క్ బాగుంది. కానీ కథాలోపం వల్ల పూర్తి థ్రిల్ అనుభవించలేం. ముందే అనుకున్నట్లు ఇది పూర్తిగా అభిమానులకు అంకితమిచ్చిన చిత్రం. యాక్షన్​ లవర్స్​ ఎంజాయ్‌మెంట్ కోసం చూడొచ్చు!