Pawan-Vijay|విజయ్ పొలిటికల్ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర పోస్ట్
Pawan-Vijay|ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయాలలోకి వస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. సక్సెస్ ఎంత వరకు సాధిస్తారు అన్నది పక్కన పెడితే రాజకీయాలలో కూడా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన రాజకీయాలలోకి వచ్చి పదేళ్ల పాటు ఎంతో కృషి చేశారు. ఈ సారి ఎన్నికలలో అఖండ విజయం సాధించి డిప్యూటీ సీఎం పదవిని అందుకున్నారు. అయితే ఇప్పు

Pawan-Vijay|ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయాలలోకి వస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. సక్సెస్ ఎంత వరకు సాధిస్తారు అన్నది పక్కన పెడితే రాజకీయాలలో కూడా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన రాజకీయాలలోకి వచ్చి పదేళ్ల పాటు ఎంతో కృషి చేశారు. ఈ సారి ఎన్నికలలో అఖండ విజయం సాధించి డిప్యూటీ సీఎం పదవిని అందుకున్నారు. అయితే ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో విజయ్ తమిళగ వెట్రి కజగం రాజకీయ పార్టీ పెట్టి ఆయన కూడా తమిళ రాజకీయాలలో సరికొత్త మార్పు తీసుకురావాలని చూస్తున్నాడు. అయితే నిన్న తన పార్టీ మొదటి బహిరంగ సభ పెట్టి తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. నిన్నటి విజయ్ TVK పార్టీ బహిరంగ సభకు ఏకంగా 5 లక్షలకు పైగా జనాభా వచ్చారు అని సమాచారం.
నిన్నటి సభతో విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని అధికారికంగా మొదలుపెట్టగా, ఈ సభలో విజయ్ ఇచ్చిన స్పీచ్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. అన్ని విషయాలని టచ్ చేస్తూ ఆయన ఇచ్చిన స్పీచ్‌కి రాజకీయ నాయకులు కూడా కొందరు ప్రశంసలు కురిపించారు. ఇక విజయ్ కి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియచేసారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా ద్వారా.. సాధువులు, సిద్ధుల భూమి అయిన తమిళనాడులో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినందుకు తిరు విజయ్ కు నా హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేసారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయం సాధించినప్పుడు విజయ్ తన పర్సనల్ ట్విట్టర్ లో..” భారీ విజయం సాధించి, జనసేన పార్టీని ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిపినందుకు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. ప్రజలకు సేవ చేసేందుకు మీ ఓర్పు, అంకితభావం అభినందనీయం అంటూ పోస్ట్ చేసాడు. అలాగే చంద్రబాబుని కూడా అభినందిస్తూ.. ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు చంద్రబాబు గారికి అభినందనలు. మీ లీడర్ షిప్ లో ఏపీ అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాను” అంటూ పేర్కొన్నాడు. చూస్తుంటే విజయ్‌కి పవన్‌తో పాటు చంద్రబాబు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తారేమో అని అందరు భావిస్తున్నారు. కాగా గతంలో పవన్ సినిమాలు విజయ్, విజయ్ సినిమాలు పవన్ రీమేక్ లు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకరి గురించి ఒకరు గతంలో గొప్పగా మాట్లాడారు కూడా.