పవన్ ఓజీ నుంచి.. సువ్వి సువ్వి… సువ్వాలా సాంగ్ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ త్రిల్లర్ ఓజీ మూవీ నుంచి వినాయక చవితి సందర్భంగా సెకండ్ సింగిల్ సువ్వి సువ్వి... సువ్వాలా సాంగ్ రిలీజ్ చేశారు

విధాత : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ త్రిల్లర్ ఓజీ మూవీ నుంచి వినాయక చవితి సందర్భంగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. ఉండిపో ఇలాగా తోడుగా నా మూడుముళ్ల లాగా… సువ్వీ సువ్వీ సువ్వాలా.. సూదంటూ రాయే పిల్లా అంటూ సాగిన మెలోడీ సాంగ్ సుందర లొకేషన్ల మధ్య సాగిన చిత్రీకరణతో ఆకట్టుకుంది. ఈ పాటకు కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించగా.. శృతిరంజని ఆలపించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి తొలి సింగిల్ గా విడుదలైన ఫైర్ స్టార్మ్ సాంగ్ ఇప్పటికే అభిమానులను అలరిస్తుంది. ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.