Pawan Kalyan| పవన్ కళ్యాణ్ చివరికి రామ్ చరణ్ దగ్గర కూడా అప్పు చేశాడా..!
Pawan Kalyan| హీరో నుండి ఏపీ డిప్యూటీ సీఎంగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ బుధవారం రోజు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పవన్‌కి దక్కిన ఈ హోదా పట్ల ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ అయితే పవన్ కళ్యాణ్‌ని ఇంటికి ఆహ్వానించి వేడుకలా సెలబ్రేట్ చేశారు. పవన్ డైరెక్ట్‌గా వెళ్లి చిరంజీవి పాదాలకు నమస్కరి

Pawan Kalyan| హీరో నుండి ఏపీ డిప్యూటీ సీఎంగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ బుధవారం రోజు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పవన్‌కి దక్కిన ఈ హోదా పట్ల ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ అయితే పవన్ కళ్యాణ్‌ని ఇంటికి ఆహ్వానించి వేడుకలా సెలబ్రేట్ చేశారు. పవన్ డైరెక్ట్‌గా వెళ్లి చిరంజీవి పాదాలకు నమస్కరిస్తే.. రామ్ చరణ్ పవన్ కళ్యాన్ పాదాలకు నమస్కరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక పవన్ కళ్యాణ్ గత పది సంవత్సరాలుగా వ్యయప్రయాసలు కూర్చి పార్టీ నడుపుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పలువురి దగ్గర అప్పులు కూడా చేశారు.
వడ్డీ కూడా ఇస్తానని చెప్పి చరణ్ దగ్గర చాలాసార్లు పవన్ కళ్యాణ్ అప్పు తీసుకున్నారట. ఈ విషజ్ఞాన్ని రామ్ చరణ్- పవన్ కలిసి ఉన్న సందర్భంలో చెప్పుకొచ్చారు. చరణ్ అప్పటికీ ఇండస్ట్రీలోకి రాలేదు. మెగా ప్యామిలీ అంతా ఉమ్మడి కుటుంబంగా…ఒకే ఇంట్లో ఉంటున్న టైమ్ లో..పవన్ కళ్యాణ్ సినిమాలు అప్పటికీ సినిమాలు చేయడం లేదు. అప్పుడు పాకెట్ మనీ కోసం నానా తంటాలు పడి చరణ్ దగ్గర డబ్బులు తీసుకున్నాడట పవన్ కళ్యాణ్. చిన్నవాడు కావడంతో.. చరణ్‌కి ఏదో ఒక కహానీలు చెప్పి.. వడ్డీ వేసి తర్వాత ఇస్తానంటూ పవన్ బాగానే గుంజాడట. ఈ విషయం పవన్ ముందే రామ్ చరణ్ చెప్పగా అప్పుడు పవన్ కూడా తెగ నవ్వేసుకున్నాడు.
ఇక రీసెంట్‌గా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత .. పవన్ కళ్యాణ్ చిలిపి చేష్టల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరచింది. చరణ్, సుస్మిత మధ్య గొడవలు పెట్టి వాటిని చూసి చూస్తూ ఎంజాయ్ చేసేవాడట పవన్ కళ్యాణ్. ఈ విషయం కూడా తెగ వైరల్ అయింది. ఇక ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ అఫిడవిట్లో తనకు అప్పుల గురించి ప్రస్తావించారు.బ్యాంకులో 17.5 కోట్ల వరకూ రుణాలు ఉన్నాయని.. అలాగే పలువురు వ్యక్తుల నుంచి 46 కోట్లు అప్పు చేసినట్లు పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ వద్ద 2 కోట్ల వ్యక్తిగత రుణం తీసుకున్నట్లు కూడా అందులో తెలియజేశారు.