Payal Rajput| ఏంటి.. పాయ‌ల్ రాజ్‌పుత్‌ని టాలీవుడ్ నుండి బ్యాన్ చేస్తున్నారా..!

Payal Rajput| ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి ప్రేక్షకాద‌రణ ద‌క్కించుకున్న అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్. ఈ అమ్మ‌డు ఆ చిత్రంలో చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఈ మూవీతో పాయ‌ల్‌కి చాలానే ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. కాని ఎందుకో ఏ సినిమా కూడా పెద్ద‌గా స‌క్సెస్ సాధించ‌లేక‌

  • By: sn    cinema    May 20, 2024 8:30 AM IST
Payal Rajput| ఏంటి.. పాయ‌ల్ రాజ్‌పుత్‌ని టాలీవుడ్ నుండి బ్యాన్ చేస్తున్నారా..!

Payal Rajput| ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి ప్రేక్షకాద‌రణ ద‌క్కించుకున్న అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్. ఈ అమ్మ‌డు ఆ చిత్రంలో చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఈ మూవీతో పాయ‌ల్‌కి చాలానే ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. కాని ఎందుకో ఏ సినిమా కూడా పెద్ద‌గా స‌క్సెస్ సాధించ‌లేక‌పోయింది.అయితే ఇటీవ‌ల మంగ‌ళ‌వారం చిత్రంలో న‌టించిన పాయ‌ల్ త‌న న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమా అందించిన హిట్‌తో ప్ర‌స్తుతం మంచి జోష్‌లో ఉన్న పాయ‌ల్ త‌న‌కు చిత్ర నిర్మాత‌ల నుండి బెదిరింపులు వ‌స్తున్నాయంటూ పేర్కొంది.ఇటీవల పాయల్ రాజ్‌పుత్ ర‌క్ష‌ణ అనే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

చిత్రంలో పాయ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌బోతున్న‌ట్టు కూడా తెలియ‌జేశారు. అయితే ఇప్ప‌డు ర‌క్ష‌ణ సినిమాని ఉద్దేశిస్తూ పాయ‌ల్ చేసిన పోస్ట్ సంచ‌ల‌నంగా మారింది. “2019-2020 సమయంలో నేను ‘రక్షణ’ అనే సినిమా ఒప్పుకోగా, ఆ మూవీకి ‘5Ws’ అని అనుకున్నారు. అయితే ప‌లు కార‌ణాల వ‌ల‌న ఆ సినిమా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.అయితే రీసెంట్‌గా నాకు ద‌క్కిన మంచి విజ‌యంతో ఇప్పుడు ఆ మూవీని రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నారు. అయితే అగ్రిమెంట్‌ ప్రకారం తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్‌ చెల్లించకుండానే ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ త‌న‌పై ఒత్తిడి తీసుకు వ‌స్తున్నారంటూ పేర్కొంది.

ప్రస్తుతం నేను అందుబాటులో లేను. అయితే నా టీమ్ చిత్ర యూనిట్‌ని సంప్ర‌దించిన త‌న‌కు చెల్లించాల్సిన రెమ్యున‌రేష‌న్ అడిగింద‌ట‌. అయితే వారు డ‌బ్బులు చెల్లించ‌కుండా త‌న‌ని బెదిరిస్తున్నార‌ని పేర్కొంది. ప్ర‌మోష‌న్స్ చేయ‌క‌పోతే టాలీవుడ్ నుండి బ్యాన్ చేస్తామ‌ని అంటున్నారట‌. నా ప్ర‌మేయం లేకుండా సినిమాలో నా పేరు, పాత్ర క‌నుక ఉంటే నేను న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌క తీసుకుంటాను అని పేర్కొంది పాయ‌ల్ రాజ్‌పుత్. రక్షణ చిత్రం క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌గా, హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నిర్మించారు. ఈ చిత్రంలో రోష‌న్‌, బిగ్‌బాస్ మాన‌స్ వంటి నటీనటులు కూడా కీల‌క పాత్ర‌లు పోషించారు