Payal Rajput | పాయల్‌ రాజ్‌పుత్‌ ‘రక్షణ’ వివాదంపై స్పందించిన TFPC

Payal Rajput | పాయల్‌ రాజ్‌పుత్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్‌ఎక్స్‌100 మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ‘మంగళవారం’ మూవీ ఢిల్లీ బ్యూటీకి మంచి పేరేవచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నది. ప్రస్తుతం పాయల్‌ నటించిన ‘రక్షణ’ మూవీ విడుదలకు సిద్ధమైంది.

Payal Rajput | పాయల్‌ రాజ్‌పుత్‌ ‘రక్షణ’ వివాదంపై స్పందించిన TFPC

Payal Rajput | పాయల్‌ రాజ్‌పుత్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్‌ఎక్స్‌100 మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ‘మంగళవారం’ మూవీ ఢిల్లీ బ్యూటీకి మంచి పేరేవచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నది. ప్రస్తుతం పాయల్‌ నటించిన ‘రక్షణ’ మూవీ విడుదలకు సిద్ధమైంది. అయితే, ఈ సినిమా విషయంలో పాయల్‌కు, నిర్మాతకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ సినిమాపై పాయల్‌ మాట్లాడుతూ.. ‘రక్షణ మూవీని 2019-2020 మధ్య షూటింగ్‌ చేశామని.. దాని ఒరిజినల్‌ టైటిల్‌ 5డబ్ల్యూస్‌ అని తెలిపింది.

ఈ మూవీ రిలీజ్‌ విడుదల ఆలస్యమైందని.. ప్రస్తుతం తనకు వచ్చిన పాపులారిటీ.. రీసెంట్‌గా వచ్చిన సస్సెక్‌ను చూసి ప్రస్తుతం సినిమాను విడుదల చేసి బెనిఫిట్స్‌ పొందాలని చూస్తున్నారని పాయల్‌ ఆరోపించింది. తనకు ఇంకా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని.. ప్రమోషన్స్‌కు పిలుస్తున్నారని.. రాకపోతే టాలీవుడ్‌లో బ్యాన్‌ చేస్తామని భయపెడుతున్నారని షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. మరో పాయల్‌పై చిత్ర నిర్మాత, దర్శకుడు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ వ్యవహారంపై తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పందించింది.

రక్షణ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌లో పాయల్‌ పాల్గొనడం లేదని నిర్మాత, దర్శకుడు ప్రణ్‌దీప్ నుంచి మార్చి 28న ఫిర్యాదు చేశారని.. ఇందులో నాలుగేళ్ల కిందటి సినిమా అని.. ఓటీటీలో రిలీజ్‌ చేసుకోవాలని పాయల్‌ చెప్పినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పింది. సినిమా కోసం 50 రోజుల డేట్స్‌ ఇచ్చారని.. మూవీ షూటింగ్‌లో 47 రోజులు మాత్రమే పని చేశారని.. ప్రస్తుతం ప్రమోషన్స్‌కు రావడం లేదని చెప్పారని తెలిపింది. అగ్రిమెంట్‌ సమయంలో ప్రమోషన్స్‌ సైతం చేయాలని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని టీఎఫ్‌పీసీ వివరణ ఇచ్చింది. అయితే, ప్రస్తుతం ఈ వివాదం ముగుస్తుందా? లేకపోతే ఎటు వైపు మళ్లుతుందో చూడాల్సిందే. ఇదిలా ఉండగా.. ప్రసుతం పాయల్‌ రాజ్‌పుత్‌ మూడు సినిమాల్లో నటిస్తున్నది. తమిళంలో గోల్‌మాల్‌, ఏంజెల్‌ చిత్రాలతో పాటు తెలుగులో కార్తీక సినిమాల్లో నటిస్తున్నది.