Elephant Attack| ఏనుగుల దాడిలో రైతు మృతి

Elephant Attack| ఏనుగుల దాడిలో రైతు మృతి

అమరావతి : చిత్తూరు(Chittoor) జిల్లాలో ఏనుగులు మరోసారి పంటల విధ్వంసానికి.. ప్రాణ నష్టానికి పాల్పడ్డాయి. సోమల(మం) కొత్తూరు వద్ద ఏనుగుల దాడి(Elephant Attack)లో రైతు రామకృష్ణంరాజు(45) మృతి చెందాడు. శనివారం పొలం వద్ధకు వెళ్లిన రామకృష్ణం రాజు(Ramakrishnam Raju)రాత్రి కూడా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా..చనిపోయి కనిపించాడు. పొలం పనులు చేస్తుండగా ఏనుగుల గుంపు ఒక్కసారిగా దాడి చేసినట్లుగా గుర్తించారు. మృతునికి భార్య రాధిక, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సుమారు 16 ఏనుగుల గుంపు పంటపొలాల్లో సంచరిస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి పారదోలారు. తరుచు తమ గ్రామానికి ఏనుగుల గుంపు వచ్చి పంట పొలాలను దాడి చేసి రైతులపై దాడికి ప్రయత్నిస్తున్నా అటవీ అధికారులు సకాలంలో స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.