Shambhala Trailer : థ్రిల్ రేపిన ‘శంబాల’ టీజర్

ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ టీజర్ థ్రిల్ రేపింది. ప్రభాస్ విడుదల చేసిన ట్రైలర్‌ ఆధ్యంతం మిస్టరీ, సస్పెన్స్ సన్నివేశాలతో ఆకట్టుకుంది.

Shambhala Trailer : థ్రిల్ రేపిన ‘శంబాల’ టీజర్

విధాత : ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘శంబాల’ ఏ మిస్టికల్ వరల్డ్ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. యుగంధర్‌ ముని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఆధ్యంతం సస్పెన్స్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. హీరో ప్రభాస్ శంబాల మూవీ ట్రైలర్ విడుదల చేశారు. పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన యుద్ధమే ఈ కథకు మూలం అంటూ సాయికుమార్‌ వాయిస్‌తో ప్రారంభమైన ట్రైలర్ లో ఇది సైన్స్‌ ఊహకు అందనిది..మీ సైన్స్ మితం..మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం అనే డైలాగులు సినిమాపై ఆసక్తిని రేపాయి.

‘అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి’..వాళ్లేమో చీమ కుట్టినా శివుడి ఆజ్ఞ అని నమ్ముతారు.. విక్రమ్ ఏమో చావులో సైతం సైన్స్ ఉందనే రకం’ డైలాగ్ లు సినిమాలోని మలుపులకు సంకేతంగా నిలిచాయి. దుష్టశక్తుల దుర్మార్గాలు…ఆ ఊరిలో చనిపోతున్న మనుషుల మరణాల వెనుక మిస్టరీలతో హర్రర్ థ్రిల్లర్ ను తలిపించేలా ఉత్కంఠభరితంగా ట్రైలర్ సాగింది. ‘శంబాల’ మూవీలో అర్చన అయ్యర్, శ్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్‌ ముఖ్యపాత్రల్ని పోషించారు. డిసెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.