Mahakali : మహాకాళి’గా భూమి శెట్టి ఫస్ట్‌లుక్ రిలీజ్
ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో భూమి శెట్టి ‘మహాకాళి’గా అవతరించింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సూపర్ హీరో యాక్షన్‌కు నాంది.
విధాత : దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(పీవీసీయూ) నుంచి రానున్న ‘మహాకాళి’ సినిమాకు సంబంధించి మేకర్స్ మరో అప్డేడ్ ఇచ్చారు. సినిమాలో టైటిల్ రోల్ మహాకాళి పాత్రలో నటించనున్న నటి భూమి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.‘విశ్వంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్ హీరోలు రానున్నారు’ అంటూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు. కన్నడ నటి భూమి శెట్టి ఇటీవల ‘కింగ్డమ్’ చిత్రంలో సత్యదేవ్ భార్యగా నటించారు. మహకాళి సినిమా గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం అని తెలిపారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రతి ఏడాది ఓ సినిమా వస్తుందని ప్రశాంత్ వర్మ గతంలో ప్రకటించారు. ఈ బ్యానర్ నుంచి మూడో సినిమాగా ‘మహాకాళి’ సినిమా రాబోతుంది. దీనికి ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు. ‘మహాకాళి’ షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో చిత్రీకరణ కొనసాగుతుంది.
ఇప్పటికే సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇటీవల ‘అధీర’ను ప్రకటించారు. ఎస్‌జే సూర్య , కల్యాణ్ దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ సూపర్ హీరో ఫిల్మ్‌కు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించనున్నారు. ప్రశాంత వర్మ ఓవైపు హనుమాన్ సిక్వెల్ ‘జై హనుమాన్’ దర్శకత్వంలో బిజీగా ఉన్నారు. మరోవైపు తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’, ‘అధిర’ ప్రకటించారు. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘బ్రహ్మరాక్షస్’ సినిమాను కూడా తెరకెక్కించబోతుండటం విశేషం. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో కూడా ప్రశాంత్ వర్మ సినిమా ఉంటుందని సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram