Adhira 1st look poster : ప్రశాంత్ వర్మ నుంచి ‘అధీర’ అప్డేట్

ప్రశాంత్ వర్మ ‘అధీర’ అప్‌డేట్: ఎస్‌జే సూర్య, కళ్యాణ్ దాసరి హీరోలు, సూపర్ హీరో మూవీ పీవీసీయూ లో రాబోతోంది.

Adhira 1st look poster : ప్రశాంత్ వర్మ నుంచి ‘అధీర’ అప్డేట్

విధాత: దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(పీవీసీయూ) నుంచి తాజాగా మరో సూపర్ హీరోస్ సినిమా ‘అధీర’ కు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. ‘ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు.. వెలుగు రూపంలో ఆశాకిరణం పుట్టుకొస్తుంది’ అంటూ ‘అధీర’ నుంచి ఆసక్తికర పోస్టర్‌ను పంచుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో ఇందులో ఎస్‌జే సూర్య, కల్యాణ్ దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా ఈ సూపర్‌ హీరో ఫిల్మ్‌ రానున్నట్లు తెలిపారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అధీర గ్లింప్స్‌ను ఓజీలో చూపించాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది.

టాలీవుడ్‌లో జాంబిరెడ్డి, హనుమాన్ సినిమాలతో ప్రశాంత్ వర్మ సంచలనాన్ని సృష్టించారు. దేవుళ్లను సూపర్ హీరోలుగా కొత్త తరం ప్రేక్షకులకు పరిచయం చేస్తూ విజయం సాధిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రిషబ్ శెట్టి నటిస్తున్న ‘జై హనుమాన్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

తన సినిమాటిక్‌ యూనివర్స్‌ (పీవీసీయూ) నుంచి ప్రతి ఏడాది ఓ సినిమా వస్తుందని..ప్రస్తుతం 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని.. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్‌ వర్మ తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే ‘మహాకాళీ’ మూవీని ప్రకటించారు. మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్‌ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాంఅని ‘మహాకాళీ’ని పరిచయం చేశారు. తాజాగా ‘అధీర’ సినిమాను ప్రకటించారు.