జబర్ధస్త్ షోతో పాపులారిటీ తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి ఫుల్ క్రేజ్ పొందిన వారిలో ప్రియాంక సింగ్ కూడా ఒకరు. ఈమె ఓ ట్రాన్స్ జెండర్ కాగా, అబ్బాయిగా ఉండగానే.. జబర్దస్త్ షోలో సందడి చేసింది. ఆ తర్వాత సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారింది. అమ్మాయిగా వేషాలు వేస్తూ జీవితం కొనసాగించలేనని భావించిన ప్రియాంక సింగ్ సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారింది. ఇప్పుడు ప్రియాంక సింగ్‌ని చూస్తే హీరోయిన్స్ కూడా అసూయ పడేలా ఉంటుంది. బిగ్ బాస్ షో తర్వాత ప్రియాంక సింగ్ జోరు మాములుగా లేదు. సోషల్ మీడియాలో హద్దులు చెరిపేస్తూ అందాల ఆరబోతతో ప్రకంపనలు పుట్టిస్తుంది.
తాజాగా ప్రియాంకా సింగ్ ఓ యూట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితుల గురించి ఓపెన్ అయింది. ఎన్నో ఆటు పోట్లు, అవమానాలు ఎదుర్కొని.. దైర్యంగా ఈరోజు అమ్మాయిగా సొసైటీలో తిరుగుతుండడం వెనక కారణాలు తెలియజేసింది.తాను చిన్నగా ఉన్నప్పటి ఉండి అమ్మాయిల డ్రెస్సులు ఎక్కువగా వేసుకునేదట. రాను రాను అమ్మాయిలా మారాలనే కోరిక కూడా కలిగేదట. హైదరబాద్ వచ్చాక తొలిసారి మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసిన ఆమె అనంతరం జబర్ధస్త్‌లో లేడి గెటప్స్ వేసి వచ్చిన డబ్బుతో సర్జరీ చేయించుకుందట. ఆ సమయంలో నొప్పితో విలవిలలాడినట్టు పేర్కొంది. ఒకానొక సందర్భంలో ఆరోగ్యం దెబ్బతినడంతో చాలా సర్జరీలు చేయించుకున్నట్టు ప్రియాంక సింగ్ పేర్కొంది.
సర్జరీ వల్ల అనేక సైడ్ ఎఫెక్స్ట్ రావడంతో ఏడాది పాటు మంచానికి పరిమితం అయిన పింకీకి నాగబాబు సాయం చేశారట. తాను బట్టలు కొనుక్కోవడానికి, ఆస్పత్రికి, మందులకు.. ఇలా అన్నింటికి నాగబాబు డబ్బులు ఇచ్చి తాను గాడ్ ఫాదర్‌లా మారారని పింకీ పేర్కొంది. ఇక తన జీవితంలో మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని, ఆ సమయంలో ఆత్మహత్యకి కూడా ప్రయత్నించినట్టు పేర్కొంది. బయట వాళ్లు అనే మాటలు ఇంట్లో వాళ్లు కూడా అనే సరికి కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నా.. దాదాపు 60 శాతం నా శరీరం కాలిపోయింది. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నాను. ఇక రెండో సారి లవ్ లో ఫెయిల్ అయ్యాను. ఓ అబ్బాయిని ప్రేమించగా, అతడు బ్రేకప్ చెప్పేయడంతో ఆ బాధను అనుభవించలేక ఆత్మహత్యకి ప్రయత్నించాను. మూడు సార్లు ఆత్మహత్యకి ప్రయత్నించిన నేను ఇంకా భూమి మీద ఉన్నానంటే ఏదో సాధించాలనేది ఉంది అంటూ ప్రియాంక సింగ్ పేర్కొంది.