Ramayana | సీతారాములు వచ్చేసారు..!

ఆదికావ్యం శ్రీమద్రామాయణం మరోసారి సినిమాగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే చడీచప్పుడూ లేకుండా షూటింగ్​ ప్రారంభించుకున్న ఈ సినిమాలో నుండి సీతారాముల అవతారాలు సోషల్​మీడియాలో లీకయ్యాయి.

  • By: Tech    cinema    Apr 28, 2024 12:19 AM IST
Ramayana | సీతారాములు వచ్చేసారు..!

ఇంతకుముందు నుంచీ నడుస్తున్న ఊహాగానాలకనుగుణంగా రాముడిగా (Lord Ram)రణబీర్​ కపూర్​, సీతగా(Maa Seetha) సాయిపల్లవి లుక్స్​ ఇవాళ సోషల్​ మీడియాను, ఇంటర్​నెట్​ను షేక్​ చేసాయి. ట్విటర్​(ఎక్స్​), ఫేస్​బుక్​, ఇన్​స్టాలల్లో అభిమానులు కామెంట్లతో కేరింతలు కొట్టారు. కొన్ని రోజుల క్రితం అరుణ్​గోవిల్​ దశరథుడిగా, లారాదత్తా కైకేయిగా ఉన్న స్టిల్స్​ కూడా లీకయ్యాయి. ఇవ్వాళ్టి సీతారాముల చిత్రాలతో, ఓం రౌత్​ ఆదిపురుష్​ను పోల్చిచూసి, మరోసారి ఆదిపురుష్​ను ట్రోల్​ చేసారు. సీతారాములంటే ఇలా ఉండాలి. భారతీయుల హృదయాలలో ముద్రించుకుపోయిన సీతారాముల అవతారాలను ఎవరు డిస్టర్బ్​ చేసినా ఫలితం అలాగే ఉంటుంది అని ఒక నెటిజన్​ వ్యాఖ్యానించాడు.

మరో ఎక్స్​ యూజర్​, సీతారాములుగా సాయిపల్లవి(Sai Pallavi), రణబీర్​కపూర్(Rambir Kapoor) అదిరిపోయారు. జంట అంటే ఇలా ఉండాలి అనగా, అద్భుతమైన దైవత్వంతో మెరిసిపోతున్నారు. చాలా అందంగా ఉంది సీతారాముల జంట అని మరొకరు కామెంట్​ చేసారు. ఒకరు మాత్రం సీతగా సాయిపల్లవి బాగాలేదని కామెంట్​ చేయగా, తన మీద ట్రోల్స్​తో ఓ రేంజ్​లో దాడిచేసారు. మరొకతను రాముడిగా రామ్​చరణ్​ను పెడితే బాగుండేది. ఇంతకుముందే ఆర్​ఆర్​ఆర్​లో రాముడిగా చూసాం కదా. ఎంత బాగున్నాడు? అని కామెంట్​ పెట్టాడు. ఏదేమైనా సీతారాముల జంటకు మాత్రం పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేసారు. ( Nitesh Tiwari’s Ramayan)

నితీశ్​ తివారి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కన్నడ స్టార్​ హీరో యశ్​, నమిత్​ మల్హోత్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గత రెండు నెలలుగా లుక్​ టెస్ట్​లు, వర్కషాప్​లు, టెక్నాలజీ చర్చలు, విఎఫ్​ఎక్స్​ వర్కషాపులతో చిత్రబృందమంతా బిజీగా ఉన్నట్లు తెలిసింది. గెటప్​ టెస్ట్​లే చాలా చేసారని తెలిసింది. ఆదిపురుష్​ దారుణం తర్వాత నితీశ్​ తివారీ అన్ని పాత్రల లుక్స్​ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్లు, ఒకటికి పదిసార్లు వాల్మీకి రామాయణాన్ని రిఫర్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. రామాయణాన్ని ఔపోసన పట్టిన కొందరు పండితులను కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి.. సీతగా సాయిపల్లవి మాత్రం చాలా బాగుందనేదని సర్వత్రా వెలువడుతున్న ప్రశంస.