Pushpa 2 | థియేటర్ల బాక్సులు బద్దలవ్వాల్సిందే.. పుష్ప 2 ఐటమ్ సాంగ్‌లో కాదు.. ఇద్దరు బ్యూటీలు..!
Pushpa 2 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన మూవీ పుష్ప. పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ మూవీ రూ.326కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. పుష్ప ద రూల్ మూవీపై భారీగా అంచనాలున్నాయి. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో పుష్పరాజ్‌కి మంచి మార్కెట్ ఏర్పడింది.

Pushpa 2 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన మూవీ పుష్ప. పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ మూవీ రూ.326కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. పుష్ప ద రూల్ మూవీపై భారీగా అంచనాలున్నాయి. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో పుష్పరాజ్‌కి మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే, ముఖ్యంగా బాలీవుడ్‌లో బన్నీ ఇమేజ్ పెరిగింది. పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నది. ఈ మూవీలో ఐటమ్ సాంగ్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
పుష్పలో ‘ఊ అంటావా మావ’ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో సమంత డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ సెన్సేషన్ హిట్‌గా నిలిచింది. పుష్ప 2లో ఎవరు సాంగ్ చేయబోతున్నారనే చర్చ సాగుతున్నది. బాలీవుడ్‌లో రూ.600 కోట్లుపైగా కలెక్షన్ రాబట్టిన శ్రద్ధా కపూర్‌లోని తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. మళ్లీ శ్రీలీలను తీసుకున్నారని టాక్ వినిపించింది. ప్రస్తుతం ఈ సాంగ్‌లో ఇద్దరు హీరోయిన్లు బన్నీతో డ్యాన్స్ చేయనున్నట్లు తెలుస్తున్నది. సమంతతో పాటు శ్రీలీల ఇద్దరూ కలిసి ఐటమ్ సాంగ్‌లో కనిపించనున్నారని తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
ఈ సాంగ్‌కు థియేటర్లు దద్దరిల్లుతుందని పేర్కొంటున్నారు. ఊ అంటావా మావ సాంగ్ థియేటర్లలో అభిమానులను ఉర్రూతలూగించింది. మరి బన్నీ, సమంత, శ్రీలీల ముగ్గురు కలిస్తే ఇంకా చెప్పాల్సిందే ఏమీ టాప్ లేచిపోవాల్సిందేనని పేర్కొంటున్నారు. అయితే, ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది తెలియదు. మేకర్స్ ప్రకటించాల్సి ఉంది. పుష్ప మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ఫహద్ ఫాజిల్, ధనంజయ్, సునీల్, అనసూయ కీలకపాత్రలో నటిస్తున్నారు.