Pushpa2| అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌పై చాలా అంచనాలు ఉంటాయి. వారి కాంబోలో రూపొందిన ఆర్య, ఆర్య2, పుష్ప చిత్రాలు పెద్ద విజయాలు సాధించాయి. పుష్ప సినిమాతో సంచనలనాలు సృష్టించింది. ఈ సినిమాతో బన్నీ ఐకాన్ స్టార్‌గా మారాడు. ఇక పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప2 చిత్రం
Pushpa2| అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌పై చాలా అంచనాలు ఉంటాయి. వారి కాంబోలో రూపొందిన ఆర్య, ఆర్య2, పుష్ప చిత్రాలు పెద్ద విజయాలు సాధించాయి. పుష్ప సినిమాతో సంచనలనాలు సృష్టించింది. ఈ సినిమాతో బన్నీ ఐకాన్ స్టార్‌గా మారాడు. ఇక పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప2 చిత్రం రూపొందుతుంది. ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుండగా, మూవీకి సంబంధించిన ప్రచారాలు కూడా మొదలు పెట్టేశారు. సినిమా మీద ఉన్న అంచనాలకు తగినట్టుగానే బడ్జెట్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ ఏ మాత్రం కాంప్రైజ్ కావడం లేదట. ప్రేక్షకులకి అనేక సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నారట.
పుష్ప 2 మూవీలో దేవి శ్రీ ప్రసాద్ తెరంగేట్రం సర్ప్రైజింగ్గా ఉంటుందని సమాచారం . దేవికి కూడా నటన మీద ఎప్పటి నుంచో ఆసక్తి ఉండడంతో పుష్ప2తో మనోడు ఆ కోరిక తీర్చుకోబోతున్నాడట. ఇక ఇటీవల మూవీ నుండి పాటని విడుదల చేయగా, ఈ పాటకి ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది పుష్ప2 సాంగ్‌ని రీల్స్ చేశారు. పుష్ప పుష్ప.. సాంగ్ లో , బన్నీ చెప్పు వదిలేసి చేసే స్టెప్పు అందరిని ఆకట్టుకుంది. అయితే ఆ స్టెప్పుని తెగ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నోయల్ రాబిన్సన్ అనే నైజీరియన్, జర్మన్ వ్యక్తి ముంబై లోకల్ ట్రైన్లో ప్యాసింజర్స్‌తో కలిసి స్టెప్పులు వేశాడు.
ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అయింది. రష్మిక మందన్న కూడా నోయల్ రాబిన్సన్ రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడం విశేషం. నోయల్ రాబిన్సన్ పలు దేశాలు తిరుగుతూ అక్కడ లోకల్ వ్యక్తులతో డ్యాన్సులు చేస్తూ తెగ సందడి చేస్తుంటాడు. రీసెంట్గా మనోడు ఇండియాకి వచ్చి అక్కడ పబ్లిక్ ప్లేసులలో రీల్స్ చేస్తూ రచ్చ చేస్తున్నాడు. ఇప్పుడు మనోడు పుష్ప 2 సినిమాలోని పాటకి డ్యాన్స్ చేయడంతో ఇప్పుడు ఈ పాటకి వేరే దేశాల్లో మరింత క్రేజ్ వస్తుంది. ఇక ఈ మూవీకి సంబంధించి బన్నీ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలైన విషయం తెలిసిందే.ఇందులో అల్లు అర్జున్ అమ్మవారి లుక్ బాగా ఆకట్టుకుంది. ఈ టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇందులో పార్ట్‌లో సునీల్, రావు రమేష్, అనసూయ, జగపతి బాబులు కీలక ప్రాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.నిన్న అనసూయ బర్త్‌డే సందర్భంగా ‘పుష్ప 2’ నుంచి ఆమె లుక్‌ను రిలీజ్ చేసింది మూవీ టీం.