Radhika Merchant |‘మంగల్ ఉత్సవ్’ కార్యక్రమంలో బంగారు దుస్తుల్లో మెరిసిపోయిన రాధిక మర్చంట్
Radhika Merchant | గత కొద్ది రోజులుగా అనంత్ అంబాని- రాధిక మర్చంట్ పెళ్లి వేడుకకి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. జులై 12న వీరి వివాహం చాలా గ్రాండ్‌గా జరగగా, ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యా

Radhika Merchant | గత కొద్ది రోజులుగా అనంత్ అంబాని- రాధిక మర్చంట్ పెళ్లి వేడుకకి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. జులై 12న వీరి వివాహం చాలా గ్రాండ్‌గా జరగగా, ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. అంబానీ ఫ్యామిలీ వారికి రుచికరమైన విందు ఏర్పాటు చేయడం కూడా మనం చూశాం. ప్రత్యేక ఫుడ్ కౌంటర్స్ ఏర్పాటు చేసి రకరకాల వంటకాలు వడ్డించారు. అయితే జూలై ‘శుభ్ వివాహ్’తో మొదలైన ఈ వేడుకలు 13వ తేదీన ‘శుభ్ ఆశీర్వాద్’, 14వ తేదీన ‘మంగల్ ఉత్సవ్’తో గ్రాండ్‌గా ముగిశాయి. ఇక ఈ పెళ్లి వేడుకల్లో వధువు రాధికా మర్చెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వేడుకకు తగ్గట్టు డ్రెస్సింగ్ స్టైల్‌తో అందరి ఆకట్టుకుంటుంది రాధికా మర్చంట్. రిసెప్షన్ కోసం సాంప్రదాయ , వెస్టర్న్ శైలిని మిళితం చేస్తూ రూపొందించిన బంగారు దుస్తుల్లో (gold outfit) రాధిక మెరిసి అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకుంది. తన జుట్టును లూజ్ గా వదిలేసి స్మోకీ కళ్లతో, న్యూడ్ మేకప్ తో లుక్ అదరహో అనిపించింది. ప్రీ వెడ్డింగ్ నుంచి రిసెప్షన్ దాకా ప్రతి లుక్ లో రాధిక మ్యాజిక్ చేస్తుంది. ప్రస్తుతం రాధిక ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక అనంత్ అంబాని, రాధిక పెళ్లి వేడుకక కోసం దేశ విదేశాలన నుండి ఎంతో మంది ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తుంది.
మార్చి నెలలో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో అతిథులకు దాదాపు 2,500 రకాల ఫుడ్స్ సర్వ్ చేసింది అంబాని ఫ్యామిలీ . ఇక పెళ్లిలో అయితే అంతకుమించి వెరైటీస్ పెట్టినట్లు తెలుస్తోంది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి భోజనాల విందులో భారతీయ వంటకాలతో పాటు అత్యంత రుచికరమైన విదేశీ ఫుడ్ ఐటెమ్స్ కూడా వడ్డించినట్టు తెలుస్తుంది. ప్రపంచంలోని పాపులర్ చెఫ్స్ వీటిని ప్రిపేర్ చేయగా, ఇందులో క్రీమీ రబ్రీ, రిఫ్రెష్ లస్సీ, కేవీయర్‌తో సర్వ్ చేసిన టిరామిసు (ఇటాలియన్ డెసర్ట్) వంటి అద్భుతమైన వంటకాలు ఉన్నాయి.