Rajamouli-Mahesh| రాజమౌళి- మహేష్ మూవీ టైటిల్ లీక్…యూనివర్సల్ టచ్‌తో అదిరిపోయిందిగా..!
Rajamouli-Mahesh| సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం థియేటర్స్‌లోకి వచ్చి చాలా రోజులు అయింది.ఈ సినిమా తర్వాత మహేష్ పూర్తిగా రాజమౌళి సినిమాకే పరిమితం అయ్యాడు. దాదాపు రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్‌తో బిజీ కానున్నాడు.ఈ సినిమా కోసం మహేష్ మేకొవర్ కూ

Rajamouli-Mahesh| సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం థియేటర్స్‌లోకి వచ్చి చాలా రోజులు అయింది.ఈ సినిమా తర్వాత మహేష్ పూర్తిగా రాజమౌళి సినిమాకే పరిమితం అయ్యాడు. దాదాపు రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్‌తో బిజీ కానున్నాడు.ఈ సినిమా కోసం మహేష్ మేకొవర్ కూడా కానున్నట్టు తెలుస్తుంది. అయితే రాజమౌళి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.ఇక ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేయనున్న సినిమా ఇదే కావడంతో మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాపై సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు.
ఇటీవల రామ్ గోపాల్ వర్మ రాజమౌళి- మహేష్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఈ ఇద్దరూ తమ కెరీర్‌లో అత్యుత్తమ స్థాయిలో ఉన్నారు. ఈ సినిమా ఇండియన్ సినిమాకు మరో మైలురాయిగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. రాజమౌళి విజన్, మహేష్‌బాబు పెర్ఫార్మెన్స్ కలిసి ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా చేస్తాయంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఇక గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి నెట్టింట అనేక ప్రచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వాటిపై జనాలకి పెద్దగా క్లారిటీ రావడం లేదు. ఆగష్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు కాగా, ఆ రోజు మూవీ టైటిట్ రివీల్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.
అయితే ఆ మూవీ టైటిల్ విషయంలో మాత్రం ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ మూవీకి “గోల్డ్” అనే టైటిల్ ను పెడుతున్నట్లు , ఇదొక యూనివర్సల్ టైటిల్ కావడంతో దానిని ఫైనల్ చేశారని టాక్ నడుస్తుంది. మరి దీనిపై అయితే పూర్తి క్లారిటీ రావలసి ఉంది. ప్రస్తుతానికైతే విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని.. మరి కొద్ది రోజులలో రాజమౌళి ఓ వర్క్ షాప్ నిర్వహించి.. ఆ తర్వాతే మూవీని సెట్స్ పైకి తీసుకెళతారని సమాచారం. ఈ సినిమాలో పలు భాషలకి చెందిన నటీనటులు భాగం కానున్నట్టు సమాచారం.