Rajeev Kanakala| మా నాన్న చనిపోతే అలా థంబ్ నెయిల్ పెట్టారు.. తప్పుడు రాతలు రాసారంటూ సుమ భర్త ఫైర్
Rajeev Kanakala| బుల్లితెరపై లేడీ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సుమ. నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకొని తెలుగింటి కోడలిగా సెటిల్ అయిపోయింది సుమ. వారిద్దరు పెళ్లి చేసుకొని పాతికేళ్లు అయింది. ఈ మధ్య సుమ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమకి సంబంధించిన అనేక వి

Rajeev Kanakala| బుల్లితెరపై లేడీ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సుమ. నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకొని తెలుగింటి కోడలిగా సెటిల్ అయిపోయింది సుమ. వారిద్దరు పెళ్లి చేసుకొని పాతికేళ్లు అయింది. ఈ మధ్య సుమ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమకి సంబంధించిన అనేక విషయాలు తెలియజేస్తూ వస్తుంది. పెళ్లయిన మొదట్లో వైరస్, దెయ్యాలు, భూతాలులాంటి సినిమాలకు తీసుకెళ్లేవాడు అని, నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను ఇలాంటి సినిమాలు చూపిస్తావేంటి అని గొడవపడ్డాను అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది సుమ.
ఇక కొద్ది రోజుల క్రితం రాజీవ్ కనకాల, సుమ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. సుమ రాజీవ్ కనకాల విడాకులు తీసుకోవడానికి కారణం ఓ హీరోయిన్ అని,రాజీవ్ కనకాల ఓ హీరోయిన్ తో సినిమాలో నటించే సమయంలో ఇద్దరి మధ్య క్లోజ్నెస్ పెరగడంతో విషయం తెలుసుకున్న సుమ అతనికి విడాకులు ఇవ్వాలనుకుందంటూ అనేక ప్రచారాలు సాగాయి. అయితే వాటిని ఇద్దరు ఖండించారు. ఇద్దరి మధ్య దూరం పెరిగినప్పటికీ మళ్లీ అవి కేవలం రూమర్సే అని తెలిసి సుమ రాజీవ్ కనకాల ఇద్దరు కలిసి పోయారు.
ఇటవల సోషల్ మీడియా ట్రోలింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు రాజీవ్ కనకాల. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… తాను ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తే వాళ్లు బాగా ఎడిట్ చేసి పబ్లిష్ చేశారని.. కాకపోతే సదరు ఛానెల్ అనుబంధ మరో సబ్ ఛానెల్ తన వీడియోను ముక్కలు ముక్కలుగా చేసి ఏవేవో థంబ్ నెయిల్స్ పెట్టి పోస్ట్ చేశారని రాజీవ్ వెల్లడించారు. .ఒకనొక సమయంలో నాన్నకు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని, 1994లో జరిగిన ఘటన గురించి చెబితే “సూసైడ్ చేసుకున్న దేవదాస్ కనకాల” అని థంబ్ పెట్టారని రాజీవ్ కనకాల తెలిపారు. ఇంటర్వ్యూ తీసుకున్న వ్యక్తికి ఫోన్ చేస్తే.. ఆయన సారీ చెప్పి వెంటనే థంబ్ మార్చారని రాజీవ్ కనకాల గుర్తుచేసుకున్నారు . నా కూతురిపై కూడా ట్రోలింగ్ చేశారంటూ బాధని వ్యక్తం చేశారు