చంద్ర‌బాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ స్పందించ‌క‌పోవ‌డంపై కార‌ణం చెప్పిన రాజీవ్

  • By: sn    latest    Oct 13, 2023 8:53 AM IST
చంద్ర‌బాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ స్పందించ‌క‌పోవ‌డంపై కార‌ణం చెప్పిన రాజీవ్

చంద్ర‌బాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ స్పందించ‌క‌పోవ‌డంపై కార‌ణం చెప్పిన రాజీవ్మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. ఆయ‌న అరెస్ట్ అయి దాదాపు నెల రోజుల‌కి పైగా అయింది. అయితే సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్ర‌బాబు తాజాగా అస్వస్థతకు గురయ్యారు.

దీంతో అక్క‌డికి చేరుకున్న ప్ర‌భుత్వ వైద్యులు చంద్రబాబుకు చర్మ సంబంధిత అలర్జీ ఉందని చెప్పారు. డెర్మటాలజీ స్పెషలిస్టు అక్క‌డికి చేరుకొని బాబుకు పరీక్షలు చేసి మెడిసిన్ సూచించినట్టు తెలుస్తుంది. అయితే చంద్ర‌బాబు ఆరోగ్య ప‌రిస్థితి నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదని.. డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ తెలియ‌జేశారు.

ఈ పరిస్థితిలో చంద్రబాబుని చూసి చాలా మంది ఆవేద‌న చెందుతున్నారు. ఆయ‌న అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు చంద్ర‌బాబు అరెస్ట్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సైతం చంద్ర‌బాబు అరెస్ట్‌ని ఖండించారు. అయితే చంద్రబాబు అరెస్ట్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఏ మాత్రం స్పందించ‌లేదు. ఇటీవ‌ల బాల‌య్య‌ని కూడా ఎన్టీఆర్ స్పందించ‌క‌పోవ‌డం గురించి మీడియా అడ‌గ‌గా, ఐ డోంట్ కేర్ అని అన్నాడు.



త‌న కుటుంబానికి సంబంధించిన వ్య‌క్తి ఇన్నాళ్లు జైలులో ఉంటే ఎన్టీఆర్ ఎందుకు స్పందించ‌డం లేద‌ని అంద‌రిలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రముఖ న‌టుడు, ఎన్టీఆర్ స్నేహితుడు రాజీవ్ క‌న‌కాల.. బహుశా ఈ విషయంపై ఎన్టీఆర్‌ స్పందించకపోవడానికి కారణం ఇదే అయ్యుంటందని అన్నారు.

రాజీవ్ క‌న‌కాల త‌న‌యుడు హీరోగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్న నేప‌థ్యంలో ఆయ‌న సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్‌లో భాగంగా మీడియాకి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదై ఉంటుంద‌ని తెలియ‌జేశాడు. వరుస సినిమాలతో తీరక లేకుండా ఉండడమే ప్ర‌ధాన కార‌ణం అయి ఉంటుంద‌ని తాను అనుకుంటున్న‌ట్టు రాజీవ్ అన్నారు.


‘ట్రిపులార్‌ సినిమా, మధ్యలో కరోనా ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్‌ కనీసం నాలుగు సినిమాలు అయిన‌ చేసేవారు. ప్రస్తుతం దేవర సినిమా చేస్తుండ‌గా, ఈ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం జూనియర్ ఈ సినిమాపైనే దృష్టిసారించారు. తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉన్న నేప‌థ్యంలో ఎన్టీఆర్ స్పందించ‌క‌పోయి ఉండ‌వ‌చ్చు అని రాజీవ్ అన్నారు. ఇక రాజ‌కీయాల గురించి స్పందిస్తూ.. ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని, వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయని అన్నారు.