Ram Charan| త‌ల్లితో పిఠాపురానికి రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌చారం కోసం కాదా..!

Ram Charan| ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌లో పిఠాపురం నియోజ‌క వ‌ర్గం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. అందుకు కార‌ణం అక్క‌డ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తుండ‌డ‌మే. ఈ సారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఎలా అయిన గెలిపించాల‌ని అభిమానులు, కుటుంబ స‌భ్యులు, ప‌లువురు ప్ర‌ముఖులు న‌డుం బిగించారు. కొద్ది రోజులుగా జ‌బ‌ర్ధ‌స్త్ బ్యాచ్ పిఠా

  • By: sn    cinema    May 11, 2024 7:30 AM IST
Ram Charan| త‌ల్లితో పిఠాపురానికి రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌చారం కోసం కాదా..!

Ram Charan| ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌లో పిఠాపురం నియోజ‌క వ‌ర్గం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. అందుకు కార‌ణం అక్క‌డ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తుండ‌డ‌మే. ఈ సారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఎలా అయిన గెలిపించాల‌ని అభిమానులు, కుటుంబ స‌భ్యులు, ప‌లువురు ప్ర‌ముఖులు న‌డుం బిగించారు. కొద్ది రోజులుగా జ‌బ‌ర్ధ‌స్త్ బ్యాచ్ పిఠాపురంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని గెలిపించాల‌ని, అత‌నికి భారీ మెజారిటీ రావాల‌ని జోరుగా ప్ర‌చారాలు చేశారు. భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా పిఠాపురంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ప్రచారం చేశారు. ఇక ప‌వన్ కుటుంబ స‌భ్యులు వ‌రుణ్ తేజ్, వైష్ణ‌వ్ తేజ్, సాయి ధ‌ర‌మ్ తేజ్ పిఠాపురంకి చేరుకొని అక్క‌డ ప‌వ‌న్ కోసం ప్ర‌చారాలు చేశారు. ఇక నాని వంటి వారు సోష‌ల్ మీడియా ద్వారా ప‌వ‌న్‌కి త‌మ సపోర్ట్ అందించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నేరుగా గ్రౌండ్ లోకి దిగకపోయినా సోష‌ల్ మీడియా ద్వారా తన తమ్ముడికి స‌పోర్ట్ అందించారు.

ఇక లాస్ట్ పంచ్ అన్న‌ట్టుగా శనివారం రోజు మెగా పవర్ స్టార్ రాంచరణ్ త‌న త‌ల్లితో క‌లిసి పిఠాపురంలో అడుగుపెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. రామ్ చ‌ర‌ణ్ డైరెక్ట్‌గా ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం అని చెప్ప‌కుండా పిఠాపురంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని తన తల్లి సురేఖతో కలసి సందర్శించబోతున్నాడు. అయితే పనిలో పనిగా తన బాబాయ్ కి ప్రచారం చేసిన‌ట్టు కూడా అయిపోతుంద‌ని లోలోప‌ల టాక్. తండ్రి ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డ్ స్వీకారోత్స‌వం కార్య‌క్ర‌మం కోసం ఢిల్లీ వెళ్లిన రామ్ చ‌ర‌ణ్ హైద‌రాబాద్‌లో ల్యాండ్ అయ్యారు.ఇక ఈ రోజు ఉద‌యం తల్లి సురేఖతో కలిసి రాజమండ్రి వెళ్లనున్నారు. అక్కడి నుంచి పిఠాపురంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి అక్క‌డ మొక్కులు చెల్లించ‌డ‌మే కాకుండా ప్ర‌త్యేక పూజ‌లు కూడా చేయ‌బోతున్నార‌ట‌.

ఇప్పుడు సురేఖ, రామ్ చరణ్ పిఠాపురం పర్యటన హాట్ టాపిక్ గా మారింది. మరి ఆలయ దర్శనం అయ్యాక సురేఖ, రామ్ చరణ్ ఏమైనా పవన్ కు మద్దతుగా ఏమైన మాట్లాడ‌తారా లేదా అనేది మాత్రం స‌స్పెన్స్‌గా మారింది. ఇక రామ్ చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. రాజకీయ నాయకుడుతో పాటు ఐఏఎస్ పాత్రలో చరణ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైజాగ్ లో షూటింగ్ జరిగినప్పుడు.. పొలిటికల్ లీడర్ గెటప్ లో ఉన్న చరణ్ లుక్స్ కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి.