Ram Charan|ఆ దేశంలోను రామ్ చ‌ర‌ణ్‌కి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్.. ఎలా ఎగ‌బ‌డుతున్నారో చూడండి.!

Ram Charan| చిరంజీవిత త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చ‌ర‌ణ్‌. ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ క్రేజ్ ద‌శ‌దిశాలా పాకింది. ఇండియాలోనే కాక దేశ వ్యాప్తంగా రామ్ చ‌ర‌ణ్‌ని ఎంత‌గానో అభిమానిస్తున్నారు. ఏ దేశం వెళ్లిన కూడా అక్క‌డి అభిమానులు రామ్ చ‌ర‌ణ్‌కి జే

  • By: sn    cinema    Aug 17, 2024 6:45 AM IST
Ram Charan|ఆ దేశంలోను రామ్ చ‌ర‌ణ్‌కి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్.. ఎలా ఎగ‌బ‌డుతున్నారో చూడండి.!

Ram Charan| చిరంజీవిత త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చ‌ర‌ణ్‌. ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ క్రేజ్ ద‌శ‌దిశాలా పాకింది. ఇండియాలోనే కాక దేశ వ్యాప్తంగా రామ్ చ‌ర‌ణ్‌ని ఎంత‌గానో అభిమానిస్తున్నారు. ఏ దేశం వెళ్లిన కూడా అక్క‌డి అభిమానులు రామ్ చ‌ర‌ణ్‌కి జేజేలు ప‌లుకుతున్నారు. తాజాగా రామ్ చరణ్ తాజాగా ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఈవెంట్లో పాల్గొనడానికి రామ్ చరణ్ మెల్‌బోర్న్ వెళ్ల‌గా అక్క‌డి ఎయిర్ పోర్ట్ లో చాలా మంది చరణ్ ఫ్యాన్స్, అక్కడ ఉండే ఇండియన్స్ వచ్చి చరణ్ కి స్వాగతం పలికారు.

అలాగే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఈవెంట్ కి కూడా చాలా మంది అభిమానులతో పాటు ఇండియన్స్, ఆస్ట్రేలియా ప్రజలు కూడా చరణ్ ని చూడటానికి, చరణ్ తో ఫొటోలు దిగడానికి, చరణ్ కి షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి చాలా ఆస‌క్తి చూపించారు. రామ్ చ‌ర‌ణ్ కోసం వేరే దేశంలో ఇంత మంది అభిమానులు ఎగ‌బడ‌డం ఇప్పుడు అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ కాగా, ఇవి చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక మెల్బోర్న్ నగరంలో ఆగస్టు 15 నుంచి 25వ తేదీ వరకు ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) 15వ చలనచిత్రోత్సవం వేడుక జ‌రుగుతుంది. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ కు గౌరవ అతిథిగా రామ్ చరణ్ కు ఆహ్వానం అందింది.

ఈవెంట్‌లో రామ్ చ‌ర‌ణ్ బ్లాక్ సూట్లో, షేడెడ్ కూలింగ్ గ్లాసెస్ తో చాలా స్టయిలిష్ గా దర్శనమిచ్చారు. రామ్ చరణ్ తో పాటు అర్ధాంగి ఉపాసన కూడా ఈ కార్యక్రమంలో మెరిసింది. త‌న భ‌ర్త‌కి విదేశాల‌లో ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంద‌ని తెలిసిన ఉపాస‌న కూడా సంతోషం వ్య‌క్తం చేసింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే రామ్ చ‌ర‌ణ్‌..రామ్ చరణ్ ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమా షూట్ పూర్తిచేశారు. ఈ సినిమా డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.